'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' కలెక్షన్స్‌ పరిస్థితి ఏంటీ?

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించి, కష్టపడి విడుదల చేసిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంకు పాజిటివ్‌ టాక్‌ దక్కించుకుంది.

అయితే ఏపీలో మాత్రం విడుదల కాలేక పోయిన ఈ చిత్రంను తెలంగాణ మరియు ఏపీ మినహా ఇతర ప్రాంతాల్లో మాత్రమే విడుదల చేయడం జరిగింది.

ఏపీలో విడుదల కాకపోవడంతో కలెక్షన్స్‌ విషయంలో పెద్ద దెబ్బ పడ్డట్లయ్యింది.మామూలుగా అయితే అన్ని ఏరియాల్లో మంచి టాక్‌ వస్తే మంచి ఓపెనింగ్స్‌ దక్కించుకుంటాయి.

కాని ఏపీలో సినిమా విడుదల కాని కారణంగా కలెక్షన్స్‌ నిరాశ పర్చాయి.

మొదటి నాలుగు రోజుల్లో ఈ చిత్రం 10.5 కోట్ల రూపాయల గ్రాస్‌ వసూళ్లను దక్కించుకుంది.అన్ని విధాలుగా ఈ చిత్రం పర్వాలేదు అనిపించింది.

Advertisement

తెలంగాణ మరియు ఓవర్సీస్‌ బయ్యర్లు సేఫ్‌ అయ్యారు.ఏపీలో మినహా విడుదల అయిన అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రం దాదాపుగా 6 కోట్ల రూపాయల షేర్‌ను దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఏపీలో కూడా ఈచిత్రం విడుదల అయ్యి ఉంటే 10 కోట్ల షేర్‌ను రీచ్‌ అయ్యేది అనే టాక్‌ వినిపిస్తుంది.

ఈనెల 5వ తారీకున మజిలీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.తప్పకుండా ఆ సినిమా ఆకట్టుకునే అవకాశం ఉంది.అంటే ఆరు కోట్లకు మరో రెండు కోట్ల వరకు వచ్చే అవకాశాలు మాత్రమే ఉన్నాయి.

అంటే లాంగ్‌ రన్‌లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం 8 కోట్ల వసూళ్లను సాధిస్తుందని అంటున్నారు.ఏపీలో ఎన్నికలు పూర్తి అయిన తర్వాత విడుదల చేసినా అప్పుడు సినిమాను పట్టించుకునే నాధుడు ఎవరు ఉండరు అనేది కొందరి మాట.ఏపీలో కోటి రూపాయల షేర్‌ను రాబట్టినా అద్బుతంగా చెబుతున్నారు.ఎందుకంటే అప్పటికే సినిమా విడుదలై మూడు వారాలు అవుతుంది.

50లోనూ యంగ్ గా కనిపించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

పైరసీ పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది.సినిమాపై ఉన్న ఆసక్తితో పైరసీని అంతా చూసే అవకాశం ఉంది.

Advertisement

అందువల్ల ఏపీలో కలెక్షన్స్‌ను పూర్తిగా వదులుకున్నట్లే అంటూ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.

తాజా వార్తలు