మెగా, నందమూరి ఫ్యామిలిలకి కుల పిచ్చి కాబట్టే ప్రభాస్ లా ఎదగలేకపోతున్నారట

బాహుబలి ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపుతోంది.

ఈ సినిమా ఇప్పటివరకు సాధించిన అతిపెద్ద అచీవ్ మెంట్ ఏమిటంటే, మొదటి మూడు రోజుల్లో అమెరికాలో $10 మిలియన్లకు పైగా వసూళ్ళు రాబట్టింది.

అది కుడా ఎమ్మా వాట్సన్, టామ్ హ్యాంక్స్ లాంటి హాలివుడ్ సూపర్ స్టార్స్ ఉన్న ది సర్కిల్ సినిమాని కాంపిటీషన్లో పెట్టుకోని, దానికన్నా ఓ మిలియన్ ఎక్కువే వసూలు చేసింది.ఇది మామూలు విషయం కాదు.

ఎమ్మా వాట్సన్ ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్.అలాంటి స్టార్ కన్నా ఎక్కువ ఓపెనింగ్స్ రాబట్టం హాలివుడ్ జనాల్ని ఆశ్చర్యపరుస్తోంది.

ప్రస్తుతం అమెరికా సినిమా ట్రేడ్ లో ఇదే హాట్ టాపిక్.ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ పేరు వినబడుతోంది, సంతోషం.

Advertisement

ఇక్కడ మెగాఫ్యామిలి, నందమూరి ఫ్యామిలి ప్రస్తావన ఎందుకు అని అనుకుంటున్నారా? రామ్ గోపాల్ వర్మ మళ్ళీ మెగా ఫ్యామిలిని టార్గేట్ చేసారు.అయితే ఈసారి నందమూరి ఫ్యామిలి మీద కుడా బాణం వేసారు.

"ప్రభాస్ రీజనల్ (లోకల్) ఫ్యాన్స్ ని పెద్దగా పట్టించుకోలేదు కాబట్టే అతినికి నేషనల్, ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ దొరికారు.కేవలం లోకల్ ఫ్యాన్స్ నే పట్టించుకున్నవారు లోకల్ గానే మిగిలిపోయారు.

కొందరు "కమ్మ-కాపు" మీద దృష్టిపెట్టినట్టు ప్రభాస్ "రాజు"ల మీద దృష్టి పెట్టి ఉంటే లోకల్ గానే మిగిలేవాడు.ఇప్పడు ఇంటర్నేషనల్ అయ్యాడు, ఎందుకంటే అలాంటి విషయాలు పట్టించుకోలేదు కాబట్టి" అంటూ ఎద్దేవ చేసారు రామ్ గోపాల్ వర్మ.

ఇక్కడ ఆర్జీవి మెగాఫ్యామిలిని, నందమూరి ఫ్యామిలిని లని టార్గెట్‌ చేసారని కొంచెం లోక జ్ఞానం ఉన్న మీకు అర్థం అవుతోంది.మరో విషయం ఏమిటంటే, ఈ సంచలనాత్మక వ్యాఖ్యలతో మాకు ఎలాంటి సంబంధం లేదు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఆర్జీవి చెప్పిందే .మేము ఇక్కడ చెప్పాం.

Advertisement

తాజా వార్తలు