అన్నంత పని చేసిన వర్మ.. బాలయ్యపై మరీ ఎందుకు ఇంత కక్ష?

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎన్టీఆర్‌ చిత్రానికి పోటీ అన్నట్లుగానే తన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రాన్ని మొదలు పెట్టిన విషయం తెల్సిందే.

ఎన్టీఆర్‌ కథానాయకుడు విడుదల సమయంలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంతో హడావుడి చేసిన వర్మ తాజాగా ఎన్టీఆర్‌ మహానాయకుడు సినిమా విడుదల సమయంలో తన సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సిద్దం అయ్యాడు.

ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతిల ప్రేమను ట్రైలర్‌ రూపంలో తీసుకు వస్తానంటూ ప్రకటించిన వర్మ, ఎన్టీఆర్‌ మహానాయకుడు విడుదల కాబోతున్న ఫిబ్రవరి 22వ తారీకున థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నాడు.

ఎన్టీఆర్‌ విడుదలైన ప్రతి థియేటర్‌ లో కూడా తన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ థియేట్రికల్‌ ట్రైలర్‌ను ప్రసారం చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.మహానాయకుడు చూసేందుకు వెళ్లిన ప్రేక్షకులకు ఇది అదనపు ఆకర్షణ అంటూ చెప్పుకొచ్చాడు.వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఇలా వరుసగా బాలయ్య మూవీ ఎన్టీఆర్‌ మహానాయకుడు చిత్రాన్ని టార్గెట్‌ చేస్తున్న నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోక క్రిష్‌ అండ్‌ కో జుట్టు పీక్కుంటున్నారు.

ఒక వైపు కథానాయకుడు చిత్రం నష్టాలు మిగల్చడంతో బాలకృష్ణ మహానాయకుడుపై ఆశలు పెట్టుకున్నాడు.

Advertisement

మహానాయకుడు చిత్రంకు పోటీగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ వస్తే ఇంకా మొదటికే మోసం వస్తుంది.లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.అయితే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ కంటే కూడా మహానాయకుడు చిత్రంకు ఎక్కువ బడ్జెట్‌ అయ్యింది.

బడ్జెట్‌ రికవరీ అవ్వాలంటే కనీసం రెండు వారాలు అయినా బాగా ఆడాలి.కాని లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌తో వర్మ రచ్చ చేస్తే మాత్రం కనీసం వారుం రోజులు అయినా ఆడే పరిస్థితి లేదు.

దాంతో వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మపై నందమూరి ఫ్యామిలీ తీవ్ర అసహనంతో ఉన్నారు.

Advertisement