ఇక ఫుల్ జోష్ లో దూసుకెళ్లనున్న రేవంత్.. అసలు కారణమిదే?

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడాలని ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.

అయితే కలహాల పార్టీగా పేరోందిన కాంగ్రెస్ ఇప్పుడు ఒకప్పటి కాంగ్రెస్ బలాన్ని తిరిగి పొందాలనే లక్ష్యంతో ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.

అయితే రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన నేతలు కూడా ఐక్యరాగం వినిపిస్తున్న నేపథ్యంలో ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన దూకుడును పెంచనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పొత్తుతో వెళ్తుందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో రేవంత్ క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా నడుం బిగించిన పరిస్థితి ఉంది.

అంతేకాక తాజాగా సోనియా గాంధీకి రేవంత్ రెడ్డి తన భవిష్యత్ ప్రణాళికలను కూడా వివరించిన నేపథ్యంలో సోనియా గాంధీ కూడా రేవంత్ ప్రణాళికలకు ఆమోదం తెలిపిన పరిస్థితి ఉంది.దీంతో ఇక రేవంత్ తన దూకుడు ఒకప్పటికంటే పదింతలు పెంచి ముందుకెళ్ళే అవకాశం ఉంది.

ఇది టీఆర్ఎస్ కొంత ఇబ్బంది పడే పరిణామం.అయితే తనకున్న వ్యతిరేక వాతావరణాన్ని తనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలనేది కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య.

Advertisement

ఎంత ప్రభుత్వం ఉన్నా ప్రతిపక్షాలు తమ శక్తికి మించి గెలుపొందేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తాయనే విషయం కాదనలేని సత్యం.అంతేకాక కాంగ్రెస్ పార్టీ కూడా క్షేత్ర స్థాయిలో బలమైన కార్యవర్గాన్ని కలిగి ఉంది.

ఇప్పటి వరకు సరైన నాయకత్వ లోపమ కారణంగానే కార్యకర్తలు నైరాశ్యంలో ఉన్నారు తప్ప సరైన నాయకత్వం ఉంటే రెండో సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కి  గట్టిపోటీ ఇచ్చే పరిస్థితి ఉండేది.ఏది ఏమైనా ఆలస్యమైనా అసలు విషయాన్ని గ్రహించారు కనుక మరి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలను అమలు పరుస్తారనేది చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు