జోరు మీదున్న రేవంత్... అసలు కారణమిదేనా?

తెలంగాణ కాంగ్రెస్ రోజురోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా క్రెడిట్ ను దక్కించుకోవడంలో కాంగ్రెస్ విఫలమవడం తద్వారా టీఆర్ఎస్ పార్టీ రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఇక వచ్చే ఎన్నికల్లో మాత్రం గత రెండు దఫా ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలను  సాధించాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కెసీఆర్ టార్గెట్ గా విమర్శల   వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.అయితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ను టీఆర్ఎస్ కు గట్టి పోటీనివ్వాలనే ఉద్దేశ్యంతో పావులు కదుపుతుండటంతో కొంత కాంగ్రెస్ పట్ల ప్రజల్లో చర్చ జరుగుతుండటంతో ఇక రేవంత్ జోరుగా తన వ్యూహాలను అమలుపరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

అంతేకాక కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లో చేరిన నేతలు మరల కాంగ్రెస్ లోకి వచ్చేందుకు కాస్త ఆసక్తి కనబరుస్తుండటంతో ఇక కాంగ్రెస్ కు పూర్వ వైభవం వచ్చే పరిస్థితి కనిపిస్తోందని అంతర్గతంగా కాంగ్రెస్ లో చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది.అయితే కాంగ్రెస్ కు కొంత ఆశాజనక ఫలితాలు వస్తుండటంతో రేవంత్ ఇక కెసీఆర్ పై విమర్శల దాడిని మరింతగా పెంచేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే ఈ కఠిన సమయంలో జోరును తగ్గిస్తే మరల బీజేపీ పుంజుకునే అవకాశం ఉండటంతో పాటు కాంగ్రెస్ శ్రేణుల్లో నిరుత్సాహం మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఏది ఏమైనా రానున్న రోజుల్లో రేవంత్ కఠిన పరిస్థితులు ఎదురుకానున్న నేపథ్యంలో ఇక జోరును తగ్గించకుండా కాంగ్రెస్ లో తిరిగి పాత రోజుల్ని తీసుకరావాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్న రేవంత్ ఏ మేరకు తన వ్యూహాలతో కాంగ్రెస్ ను తిరిగి గాడిలో పెట్టగలుగుతాడనేది చూడాల్సి ఉంది.

Advertisement
శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?

తాజా వార్తలు