CM Revanth Reddy : ఏపీ టూర్ కి రేవంత్ .. చంద్రబాబు కి ఇబ్బందేనా ?

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏపీ పర్యటనకు రాబోతున్నారు.

ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా మార్చి 11వ తేదీన ఏపీ కాంగ్రెస్( AP Congress ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రేవంత్ పాల్గొని ప్రసంగించబోతున్నారు.

తెలంగాణ తరహా లోనే ఏపీలోనూ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో కాంగ్రెస్ హై కమాండ్ ఉంది.దీనిలో భాగంగానే రేవంత్ కు పరోక్షంగా ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యత అప్పగించింది.

అదీ కాకుండా త్వరలో ఏపీలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజార్టీ స్థానాలు దక్కే విధంగా రేవంత్ తో ఎన్నికల ప్రచారాన్ని చేయించేందుకు నిర్ణయించింది.ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ).ఏఐసిసి ఇన్చార్జి మాణిక్యరావు ఠాక్రే ఆహ్వానం మేరకు ఏపీలో కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు.

ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగనున్న మూడు సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొనే విధంగా షెడ్యూల్ ను రూపొందించారు.ఈనెల 11వ న ఉదయం భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి నేరుగా గన్నవరం చేరుకుంటారు రేవంత్.అక్కడి నుంచి విశాఖకు వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి.11న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ( Vizag Steel Plant )కు వ్యతిరేకంగా అన్ని ప్రజాసంఘాలను కలుపుకుని ఈ సభను విజయవంతం చేసే విధంగా కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి విమర్శలు చేసే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

అదే జరిగితే ఎన్డీఏలో ఈ రోజో, రేపో చేరబోతున్న టిడిపికి అది ఇబ్బందికర విషయమే.రేవంత్ ఎన్డీఏ పై విమర్శలు చేస్తే దాన్ని టిడిపి కచ్చితంగా ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.తన రాజకీయ గురువు చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ఉండే అవకాశం కనిపిస్తుండడంతో రేవంత్ ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది.

దండం పెడతాను నన్ను వదిలేయండి...పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయిన రేణు దేశాయ్!
Advertisement

తాజా వార్తలు