ఆ కారణాలతో ...రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రాజీనామా !

కేంద్ర ప్రభుత్వానికి.రిజర్వ్ బ్యాంక్ కి మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాల కారణంగా.

రిజర్వు బ్యాంక్ గవర్నర్ పదవికి ఊర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు.అయితే ఆయన మాత్రం .తాను వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు.రిజర్వు బ్యాంక్ లో వివిద పదవులలో సేవలు అందించడం తనకు గర్వకారణం అని ఆయన అన్నారు.

రిజర్వుబ్యాంకులో ఉన్న మిగులు మూడు లక్షల కోట్ల రూపాయలను కేంద్రానికి బదలాయించాలన్న ప్రతిపాదనపై ఊర్జిత్ బిన్నాభిప్రాయం వ్యక్తం చేశారని అంటున్నారు.కాగా కేంద్రం విధానాలకు అనుగుణంగా పటేల్ వ్యవహరించడం లేదని కేంద్రం వాదనగా ఉంది.మొదట ఊర్జిత్ పటేల్ ను తీసుకువచ్చినప్పుడు ప్రతిపక్షాలు ప్రదాని మోడీపై విమర్శలు చేశాయి.

కావాలని గుజరాత్ కు చెందిన వ్యక్తిని పెట్టారని అన్నారు.ఇప్పుడు ఆయన రాజీనామా చేయడం గమనార్హం.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 8, బుధవారం 2023
Advertisement

తాజా వార్తలు