కాంగ్రెస్‌లో పాత సీన్ రిపీట్ ! ర‌థ‌సార‌ధి సోనియానే ?

కాంగ్రెస్ పార్టీ భ‌విష్య‌త్ ప్ర‌స్తుతం సందిగ్ధంలో ప‌డింది.ఉత్త‌రాది ఐదు రాష్ట్రాల్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది.

దీంతో పార్టీ ఉనికి ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.దీంతో పార్టీ నాయ‌క‌త్వంపై మ‌రోమారు తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది.

కాంగ్రెస్ పార్టీలో గాంధీ నాయ‌క‌త్వంపై గుర్రుగా ఉన్న‌ట్టు క‌నిపించే కూట‌మి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.దీంతో పార్టీ చీఫ్ సోనియాగాంధీ అధ్య‌క్ష‌త‌న కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశం ఏర్పాటు చేశారు.

గంట‌ల త‌ర‌బ‌డి చ‌ర్చ వాడీవేడీగా కొన‌సాగింది.మొత్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నిక ల ఫ‌లితాల‌పై స‌మీక్షించారు.

Advertisement

పార్టీ ప్ర‌యోజ‌నాల కోసం ఎలాంటి త్యాగానికైనా తాను సిద్ధ‌మేన‌ని ఎప్ప‌టి మాదిరిగానే చెప్పారు.అంటే త‌న‌కున్న రాజ‌కీయ వైరాగ్యాన్ని ప‌రోక్షంగా చెప్పిన‌ట్టు అర్థం అవుతోంది.

అయితే త‌న‌కు కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వి అక్క‌ర్లేద‌ని ఎంత మొత్తుకున్నా.సోనియా నాయ‌క‌త్వం మీద కాంగ్రెస్ కోర్ క‌మిటీ సంపూర్ణ విశ్వాసాన్ని ప్ర‌క‌టించింది.

అంటే పాత ప‌ద్ధ‌తిలోనే గాంధీ కుటుంబ‌మే దిక్కు అన్న‌ట్టు నేత‌లు వ్య‌వ‌హరించ‌డం గ‌మ‌నార్హం.అయితే ఈ చ‌ర్చ‌ల్లో తొలుత నాయ‌క‌త్వ మార్పుపై చ‌ర్చ‌లు జోరుగా కొన‌సాగాయి.

తుది నిర్ణ‌యం మాత్రం గాంధీ కుటుంబ‌మే దిక్కు అన్న‌ట్టు మారింది.ఇది ఇప్ప‌టి నిర్ణ‌యం కాదు కొన్నేండ్లుగా వ‌స్తోంది.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

నేడు కూడా ఇలాంటి ప‌రిస్థితే రావ‌డం చ‌ర్చ‌కు దారితీస్తోంది.రాబోయే ఎన్నిక‌ల్లో రాజ‌కీయ స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు, పార్టీని బ‌లోపేతం చేసేలా పార్టీ మార్పుల‌కు శ్రీకారం చుట్టాల‌ని డిసైడ్ చేశారు.

Advertisement

పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల అనంత‌రం పార్టీలో చింత‌న్ శిబిర్ నిర్వ‌హిస్తామ‌ని, అధ్య‌క్షురాలు త‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌డ‌తార‌ని పార్టీ కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు.అయితే అధికారంలో ఉన్న రాజ‌స్థాన్ లో చింత‌న్ శిబిర్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.అయితే పార్టీ ప‌ద‌వుల‌కు రాజీనామాకైనా సిద్ధం అంటున్న సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక‌గాంధీల నిర్ణ‌యాన్ని సీడ‌బ్ల్యూసీఓ ముందు పెట్టారు.

కాగా వారి ప్ర‌తిపాద‌న‌ను స‌భ్యులు అంద‌రూ ఏక‌గ్రీవంగా రిజెక్టు చేశార‌ని స‌మాచారం.మొత్తంగా గాంధీ కుటుంబాన్ని ప‌క్క‌న పెట్టి కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాల‌ను అందుకునే సాహసం ఎవ‌రూ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

" autoplay>