NIVEA బాడీ లోషన్ లో ఇది కలిపి రాస్తే కంటి చుట్టూ నలుపు మాయం అయ్యిపోతుంది

మన చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే మన చర్మానికి బాడీ లోషన్,మాయిశ్చరైజర్ ని తప్పనిసరిగా ఉపయోగించాలి.ఈ విధంగా ఉపయోగించటం వలన చర్మం తేమగా,ఆరోగ్యంగా,కాంతివంతంగా ఉంటుంది.

చర్మం మీద ముడతలు తొందరగా ఏర్పడకుండా మరియు చర్మం డేమేజ్ అవ్వకుండా చేసుకోవచ్చు.బిజీ జీవనశైలిలో పగటి సమయంలో మాయిశ్చరైజర్ అప్లై చేయటం కుదరని వారు రాత్రి పడుకొనే ముందు అయినా సరే కచ్చితంగా అప్లై చేయాలి.

ఇప్పుడు మనం NIVEA బాడీ లోషన్ ని ఉపయోగించి కంటి చుట్టూ నల్లటివలయాలను ఎలా తగ్గించుకోవాలో చూద్దాం.ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కంటి కింద నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతున్నారు.

ముఖం ఎంత అందంగా ఉన్నా కంటి చుట్టూ నల్లటి వలయాలు ముఖ అందాన్ని దెబ్బతీస్తుంది.దాంతో కంటి కింద నల్లటివలయాలను తగ్గించుకోవటానికి చాలా ప్రయత్నాలను చేస్తూ ఉంటారు.

Advertisement

అలాంటి వారు ఇప్పుడు చెప్పే ఈ చిన్న చిట్కాను ప్రయత్నిస్తే సులభంగా కంటి కింద నల్లటి వలయాలు మాయం అవుతాయి.అయితే NIVEA బాడీ లోషన్ ఎలా ఉపయోగించాలా అని ఆలోచిస్తున్నారా? ఆ విషయంలోకి వస్తే ఈ చిట్కాకు కావలసినవి NIVEA బాడీ లోషన్,విటమిన్ E క్యాప్సిల్.NIVEA బాడీ లోషన్ లేనివారు NIVEA క్రీమ్ ని కూడా ఉపయోగించవచ్చు.ఒక బౌల్ లో NIVEA బాడీ లోషన్ వేసి దానిలో విటమిన్ E ఆయిల్ వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని కంటి చుట్టూ అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి.ఈ విధంగా రోజులో రెండు సార్లు చేస్తే కంటి చుట్టూ నలుపు,ముడతలు తగ్గిపోతాయి సరైన నిద్ర లేకపోయినా కంటి చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి.

కాబట్టి రోజుకు 7 గంటల నిద్ర అవసరం.అలాగే నీటిని ఎక్కువగా తీసుకోవటం మరియు మంచి పోషకాహారం తీసుకోవటం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

హమ్మో, అంత పెద్ద రాయిని బొమ్మ లాగా ఎత్తాడే.. ఈ పోటీ చూస్తే..??
Advertisement

తాజా వార్తలు