కొత్త ఇంట్లోకి ప్రవేశించబోతున్నారా..? అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి..!

వాస్తు శాస్త్రం( Vastu Shastra ) శక్తిపై ఆధారపడి ఉంటుంది.అలాగే ఇంట్లోకి ఆనందం, అభివృద్ధి తీసుకురావడానికి చాలా విషయాలు వాస్తు శాస్త్రంలో చెప్పబడింది.

ఈ నియమాలను పాటిస్తే జీవితం చాలా ఆనందంగా కొనసాగుతుంది.అయితే ఇంటికి సంబంధించిన ప్రత్యేక నియమాలు కూడా వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం కొత్త ఇంట్లోకి( New House ) ప్రవేశించినప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.లేదంటే వాస్తు దోషమవుతుంది.

దీంతో మీరు ప్రారంభించే ప్రతి పనుల్లో తరచూ ఆటంకాలు ఎదురవుతాయి.అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఏం చేయాలో ఏ విషయాలను గుర్తుంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఇంటి లోపల పసుపు రంగు తెరలు( Yellow Screens ) వేయాలి.పసుపు ద్రావణాన్ని ఇల్లు మొత్తం చల్లాలి.ఇది శుభగ్రహం, గృహస్పతి ఆశీర్వాదాలను తెస్తుంది.

అలాగే అతడి ఆశీర్వాదంతో కుటుంబం అభివృద్ధి చెందుతుంది.ఇక కొత్త ఇంట్లో వాస్తు దోషం( Vastu Dosha ) లేకుండా ఉండాలంటే తెల్ల బియ్యం లేదా కర్పూరం దానం చేయాలి.

అలాగే ఇంటి గోడలకు( Walls ) నీలం, ఆకుపచ్చ, తెలుపు లాంటి శుభమైన రంగులు వేయాలి.దీని వలన ఇంటి కుటుంబ సభ్యుల మనోధైర్యాన్ని పెంచవచ్చు.

అలాగే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది.ఉదయం పూట సూర్యకాంతి పొందే విధంగా ఇల్లు ఉండాలి.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
కేదార్‌నాథ్‌కు హెలీ సర్వీస్.. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోండిలా...

అలాగే ఇంట్లో చీకటి ఉంటే అది వాస్తు దోషం అవుతుంది.

Advertisement

దీంతో దురదృష్టం, అనారోగ్యం, దుఃఖాన్ని కలిగిస్తుంది.మీరు కొత్త ఇంటికి మారిన వెంటనే ఉద్యోగంలో సమస్యలను ఎదుర్కొంటున్నారంటే ఆవాల నూనె( Mustard Oil ) దానం చేయాలి.అలాగే శనివారం సాయంత్రం పీపల్ చెట్టు దగ్గర నూనె దీపం వెలిగించాలి.

ఇక కొత్త ఇంటిలో సంతోషం, శాంతికి విఖాసం కలిగితే ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తిక్ యంత్రాన్ని అమర్చాలి.అలాగే ప్రధాన ద్వారం దగ్గర గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించాలి.

ఇక కొత్త ఇంట్లో వాస్తు దోష నిర్మూలన యంత్రం ఏర్పాటు చేసుకోవాలి.అంతేకాకుండా లాఫింగ్ బుద్ధ, క్రిస్టల్ తాబేలు ఇంట్లో ఉంచడం వలన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

అలాగే ప్రతిరోజు ఉప్పుతో ఇంటిని తుడుచుకోవడం వలన కూడా ఇంట్లో ఐశ్వర్యం ఎల్లప్పుడూ నిలుస్తుంది.

తాజా వార్తలు