'మదర్ థెరెస్సా' పై 'మతం' చిచ్చు!!

సమాజ సేవకు చిహ్నంగా నిలిచిన మదర్ థెరెస్సా పై మతం రంగు పులుముకుంటుంది.

అమ్మా అంటూ పలకరించిన ఆమెను ఇప్పుడు మతం ముసుగు కప్పెస్తుంది.

వివరాల్ళోకి వెళితే.మదర్ థెరీసాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు శివసేన మద్దతుగా నిలిచింది.

ఆయన కొంత నిజమే చెప్పారని ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో పేర్కొంది.విదేశాల నుంచి మిషనరీలుగా వస్తున్న క్రైస్తవ సంస్థలు మన దేశంలో చాలామందిని క్రైస్తవ మతంలోకి మారుస్తున్నాయని ఆ పత్రికలో పేర్కొంది.

ముస్లింలు కత్తితో బెదిరించి మత మార్పిడి చేస్తే, క్రైస్తవులు డబ్బు, సేవల పేరిట మతమార్పిడిలకు పాల్పడుతున్నారని ఆ శివసేన పేర్కొంది.అయితే, మనమంతా మదర్ థెరిసా సేవలను గుర్తించామని, ఆమెలాగే చాలామంది కూడా సేవలందించారని, కానీ ఎలాంటి మత మార్పిడిలకు దిగలేదని సామ్నాలో పేర్కొంది.

Advertisement

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రాజస్ధాన్‌లోని భరత్ పూర్‌లో జరిగిన ఎన్జీఓ కార్యక్రమంలో నిరుపేదలకు మదర్ థెరిస్సా సేవ అందించడం వెనుకున్న ప్రధాన లక్ష్యం క్రైస్తవ మత మార్పిడేనని అన్నారు.మదర్ థెరిస్సా సేవలు మంచిదే.

కానీ వ్యక్తులను క్రైస్తవ మతంలోకి మార్పిడి చేయడానికి సేవను ఆధారంగా చేసుకున్నారని అన్నారు.దేశంలోని పేదలను సేవల ద్వారా మత మార్పిడికి పాల్పడటం వల్ల ఆమె అందించిన సేవకు విలువ లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు.

మదర్ థెరిస్సా సేవలపై మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసంబధ్దం అంటూ కాంగ్రెస్ కొట్టి పారేసింది.ఏది ఏమైనా సమాజ సేవను కూడా కమర్షియల్ గేయా చూస్తున్న నాయకులు వారి ఉనికి కాపాడుకోవడం కోసం ఇలా మాట్లాదంతం ఎంతవరకూ సబబో వారికే తెలియాలి.

ఈ పండ్లు ఆరోగ్యానికే కాదు జుట్టును ఒత్తుగా కూడా మారుస్తాయని తెలుసా?
Advertisement

తాజా వార్తలు