జియో మోసం చేసిందా?

అన్ లిమిటెడ్ 4G డేటా, ఫాస్టెస్ట్ 4G స్పీడ్, అన్ లిమిటెడ్ కాల్స్ .

ఇదంతా వినే కదా జనాలు ఏదో పెద్ద హీరో సినిమా రిలీజ్ కి వెళ్ళినట్లు గంటల గంటలు లైన్ లో నిల్చోని ఎగబడి ఎగబడి జియో సిమ్ లు తీసుకున్నారు.

కష్టపడి తీసుకున్న తరువాత కొందరికి వారం దాకా యాక్టివేట్ కాకపోతే, కొందరికి పది రోజుల దాకా కాలేదు.మరి కొంతమందికి ఇప్పటికి దాకా జియో సర్వీసులు యాక్టివేట్ కాలేదు.

అది పక్కనపెడితే జియో ఇంటర్నెట్ సర్వీసుల స్పీడ్ చాలావరకు తగ్గిపోయింది.నిన్నమొన్నటి దాకా 15MBPS దాకా స్పీడ్ పొందిన యూజర్లు ఇప్పుడు స్పీడ్ కాస్త 5 MBPS కి తక్కువగా పడిపోవటంతో వాపోతున్నారు.

అంతమాత్రమే కాదు.అన్ లిమిటెడ్‌ ఇంటర్నెట్ ఆఫర్ ని కూడా ఎత్తేసింది రిలయన్స్.

Advertisement

ఇప్పుడు రోజుకి 4GB లిమిట్.అది దాటిన తరువాత మీరు కనీస బ్రౌజింగ్ స్పీడ్ కూడా పొందలేరు.

ఇక కాల్స్ సంగతి మాట్లాడుకోకపోవడమే మంచిది.ఎప్పుడు కనెక్టు అవుతాయో, ఎప్పుడూ హ్యాండ్ ఇస్తాయో అర్థం కాదు.

రూపాయి ఖర్చులేకుండా లభించిన సర్వీసులు సరిగా వస్తే ఎంత, రాకపోతే ఎంత అని వాదించేవారు లేకపోలేదు.కాని చేసిన వాగ్దానాలు జనాలు మర్చిపోవడం కష్టమే కదా.జియో సర్వీసులు అందరికి లాభాకరమే.కాని ఇప్పడు సమస్య ఎవరికి వచ్చింది అంటే, తమ నంబర్ ని జియోకి పోర్టు చేయించుకుందాం అని ఆలోచించిన వారికి.

ఒక్కసారి పోర్ట్ అయితే మూడు నెలలు నెట్వర్క్ మార్చలేం, ఇంటర్నెట్ సర్వీస్ సరిగా లేకపోయినా సరిపెట్టుకోవచ్చు కాని, కాల్స్ కనెక్టు కాకపోతే ఎన్ని హంగులు ఉండి ఏం లాభం అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు మొబైల్ మార్కెట్ విశ్లేషకులు.

Advertisement

తాజా వార్తలు