వేసవి వేడికి విపరీతంగా నీరసం వస్తుందా.. అయితే ఇది తెలుసుకోండి!

అసలే వేసవికాలం.( Summer ) ఎండలు మండిపోతున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కొంత చల్లటి వాతావరణం ఉన్నప్పటికీ.

కొన్ని ప్రాంతాల్లో మాత్రం భానుడు బెంబేలెత్తిస్తున్నాడు.

అయితే వేసవి వేడికి బాడీ డిహైడ్రేట్ అయ్యి విపరీతమైన నీరసం( Fatigue ) ఏర్పడుతుంటుంది.చాలా అసౌకర్యానికి గురవుతుంటారు.

ఏ ప‌ని చేయ‌లేక‌పోతుంటారు.అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ కనుక తీసుకుంటే నీరసం దెబ్బకు పరార్ అవుతుంది.

Reduce The Fatigue Caused By The Summer Heat With This Juice Details, Summer He
Advertisement
Reduce The Fatigue Caused By The Summer Heat With This Juice Details, Summer He

జ్యూస్ తయారీ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు ఫ్రెష్ క్యారెట్ ముక్కలు( Carrot ) వేసి అర గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో ఒక అరటి పండును( Banana ) పీల్ తొలగించి స్లైసెస్ గా కట్ చేసి వేసుకోవాలి.

అలాగే ఒక కప్పు ఫ్రెష్ క్యారెట్ జ్యూస్, ఒక క ప్పు కాచి చల్లార్చిన పాలు,( Milk ) రెండు గింజ తొలగించిన ఖర్జూరాలు,( Dates ) రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ బనానా జ్యూస్ అనేది రెడీ అవుతుంది.

Reduce The Fatigue Caused By The Summer Heat With This Juice Details, Summer He

ప్రస్తుత వేసవికాలంలో ఈ జ్యూస్ హెల్త్ కు చాలా మేలు చేస్తుంది.ముఖ్యంగా ఈ జ్యూస్ నీరసం, అలసటను తొలగిస్తుంది.శరీరాన్ని శక్తివంతంగా మారుస్తుంది.

తలనొప్పికి చెక్ పెడుతుంది.వేసవి తాపాన్ని తగ్గిస్తుంది.

జలియన్ వాలాబాగ్ మారణహోమం: భారత్‌కు క్షమాపణ చెప్పాల్సిందే ... యూకే ఎంపీ డిమాండ్
ఈ ఒక్కటి డైట్ లో ఉంటే షుగర్ కంట్రోల్ నుంచి వెయిట్ లాస్ వరకు ఎన్నో బెనిఫిట్స్ మీ సొంతం!

బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ను అందిస్తుంది.అలాగే ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేట్ గా ఉంటుంది.

Advertisement

సన్ స్ట్రోక్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.కాబట్టి వేసవి వేడికి విపరీతంగా నీరసం వస్తుంద‌ని బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న క్యారెట్ బనానా జ్యూస్ ను తీసుకోవడానికి ప్రయత్నించండి.

తాజా వార్తలు