రెడిట్ యూజర్లకు అదిరిపోయే న్యూస్.. ఇకనుంచి డబ్బులు సంపాదించొచ్చు..!

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన రెడిట్( Reddit ) కొంతమంది యూజర్ల కంటెంట్‌కు మనీ చెల్లించడం ప్రారంభిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది.

ఈ మేరకు కాంట్రిబ్యూటర్ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నట్లు తెలిపింది.

కంపెనీ తన గోల్డ్ సిస్టమ్‌లో కూడా మార్పులు చేసింది, ఇది యూజర్లు తమకు నచ్చిన పోస్ట్‌లు, కామెంట్స్‌కు అవార్డులను ఇవ్వడానికి అనుమతిస్తుంది.

కొత్త గోల్డ్ సిస్టమ్( Gold System ) కంటెంట్ క్రియేటర్స్‌కు రివార్డ్ ఇవ్వడాన్ని సులభతరం చేస్తుంది.ఆరు విభిన్న గోల్డ్ ఆప్షన్స్ చూడటానికి యూజర్లు ఇప్పుడు మొబైల్‌లో అప్‌వోట్ బటన్‌ను నొక్కి పట్టుకోవచ్చు లేదా డెస్క్‌టాప్‌పై హోవర్ చేయవచ్చు.గోల్డ్ ఆప్షన్స్ 1.99 డాలర్ల నుంచి 49 డాలర్ల వరకు ఉంటాయి.ఒక్కొక్కటి వేరే పేరు, ఐకాన్స్‌ కలిగి ఉంటాయి.

గోల్డ్ అవార్డులు పోస్ట్‌లు, కామెంట్‌ల పక్కన కనిపిస్తాయి.ఈ గోల్డ్ తో కంటెంట్ క్రియేటర్స్‌ రెడిట్ కాయిన్స్, ప్రీమియం సభ్యత్వం వంటి ప్రయోజనాలను అందుకుంటారు.

Advertisement

కొత్త గోల్డ్ సిస్టమ్ ప్రస్తుతం కొన్ని మొబైల్ కమ్యూనిటీలలో అందుబాటులో ఉంది.భవిష్యత్తులో మరిన్ని కమ్యూనిటీలకు, వెబ్ వినియోగదారులకు ఇది విస్తరించబడుతుంది.

ఇక కొత్త కంట్రిబ్యూటర్ ప్రోగ్రామ్( Reddit Contributor Program ) రెడిట్ వారి కంటెంట్ కోసం దాని యూజర్లకు డబ్బులు అందించే మరొక మార్గం.తగినంత కర్మ, గోల్డ్ వంటి నిర్దిష్ట ప్రమాణాలను కలిగి ఉన్న యూజర్లు ఈ ప్రోగ్రామ్‌లో చేరి డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేయవచ్చు.కర్మ అనేది ఒక వినియోగదారు రెడిట్ కి ఎంతవరకు సహకరిస్తున్నారనే దాని కొలమానం, గోల్డ్ అనేది వినియోగదారులు ఇతరుల నుంచి కొనుగోలు చేయగల లేదా స్వీకరించగల కరెన్సీ.

ప్రోగ్రామ్ వారి కర్మ( Karma ), గోల్డ్ ఆదాయాల ఆధారంగా వినియోగదారులకు చెల్లిస్తుంది.చెల్లింపులు రెడిట్ నాణేలు కాకుండా నిజమైన డబ్బులో ఉంటాయి.కంట్రిబ్యూటర్ ప్రోగ్రామ్ ప్రస్తుత అమెరికాలోని యూజర్లకు మాత్రమే అందుబాటులోకి ఉంది.

ఇది ఇంకా డెవలప్‌మెంట్‌ స్టేజ్ లో ఉండగా రెడిట్ దాని గురించి మరిన్ని వివరాలను త్వరలో షేర్ చేస్తుంది.

సూదిలేని టీకా వచ్చేస్తుంది..... స్వదేశీ తొలి డీఎన్ఏ ఆధారిత టీకా
Advertisement

తాజా వార్తలు