బెండకాయలను లేడీస్ ఫింగర్ అని పిలుస్తారు.బెండకాయలను ఇష్టపడని వారు ఉండరు.
బెండకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది.
కాబట్టి బెండ పంటకు ఇప్పుడు మంచి డిమాండే ఉంటుంది.
బెండకాయ ఆకుపచ్చ లేదా లైట్ కలర్ చిలకపచ్చ రంగులో ఉంటాయని అందరికీ తెలిసిందే.కానీ ఎరుపు రంగు బెండకాయలు ఉంటాయని చాలామందికి తెలియదు.
కొంతమంది రైతులు ఎరుపు రంగు బెండకాయలను( Red Ladyfingers ) సాగు చేసి అధిక లాభాలను( High profits ) పొందుతున్నారు.ఆకుపచ్చ బెండకాయలతో పోలిస్తే, ఎరుపు రంగు బెండకాయలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది.ఒక కిలో ఎరుపు రంగు బెండకాయల ధర సుమారుగా రూ.300 పైనే ఉంటుంది.
ఒక్కో ఎరుపు రంగు బెండకాయ( Red Ladyfingers ) చెట్టు నుండి దాదాపుగా 60 కాయల దిగుబడి పొందవచ్చు.పైగా ఎరుపు రంగు బెండకాయలకు చీడపీడల, తెగుళ్ల బెడద కాస్త తక్కువ.ఈ బెండకాయలు ఎరుపు రంగులో ఉండడం వల్ల వివిధ కాల పురుగులు ఈ పంటను ఆశించవు.
కాబట్టి తక్కువ పెట్టుబడి పెట్టి అధిక లాభాలు పొందే పంటగా ఎరుపు రంగు బెండకాయల పంటను చెప్పుకోవచ్చు.
వేసవికాలంలో పొలాన్ని లోతు దుక్కులు దుక్కుకోని ఇతర పంటలకు సంబంధించిన అవశేషాలన్నీ పూర్తిగా తొలగించి కాల్చి నాశనం చేయాలి.ఒక ఎకరాకు ఐదు నుండి ఆరు టన్నుల పశువుల ఎరువులు వేసి పొలాన్ని కలియదున్నాలి.తెగులు నిరోధక ఆరోగ్యకరమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.
మొక్కల మధ్య మొక్కల వరుసల మధ్య కాస్త అధిక దూరం ఉంటే సూర్యరశ్మి, గాలి బాగా తగిలి మొక్క ఆరోగ్యకరంగా పెరగడంతో పాటు మొక్కకు బెండకాయలు ఎక్కువగా కాస్తాయి.ఇక ఈ పంటకు చీడపీడల బెడద చాలా తక్కువ కాబట్టి పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండి సకాలంలో సంరక్షక చర్యలు చేపడుతూ ఉంటే అధిక దిగుబడులు సాధించి ఆశించిన స్థాయిలో లాభాలు పొందవచ్చు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy