పీరియడ్స్ లో అమ్మాయిలు గుడికి ఎందుకు వెళ్ళకూడదు?

పీరియడ్స్ లో అమ్మాయిలు గుడికి వెళ్ళకూడదు అనే వాదన వినే ఉంటారు.చాలామంది అమ్మాయిలు (దాదాపుగా అందరు) పీరియడ్స్ సమయంలో గుడికి వెళ్ళరు కూడా.

ఇలా ఎందుకు? పీరియడ్స్ లో స్త్రీ భగవంతుడికి దూరంగా ఉండాలా? ఎంతవరకు సమంజసకరమైన విషయం ఇది? దీనివెనుక మతపరమైన కారణాలున్నాయా? హిందూ మతం ప్రకారం పీరియడ్స్ అమ్మాయిలు గుడికి వెళ్ళకూడదు అనే ఆచారం ఉండొచ్చు ఉండకపోవచ్చు కాని, పూర్వకాలం నుంచి అమ్మాయిలు పీరియడ్స్ లో గుడికి వెళ్ళడం ఎందుకు మానేసారో చెప్పడానికి ఓ బలమైన కారణమే ఉంది.అదేంటో చూడండి.

Reason Why Girls Are Not Allowed At Temple During Periods , Girls , Temple , D

ఇప్పుడంటే పీరియడ్స్ ని, వచ్చే రక్తాన్ని మేనేజ్ చేయడానికి ఎన్నో ఉపయోగాలున్నాయి.పీరియడ్స్ రక్తం కోసం ప్యాడ్స్ ఉండటంతో హైజిన్ బాగా మేయింటేన్ చేయగలుగుతున్నారు అమ్మాయిలు.

కాని ఒకప్పుడు ఇలాంటి ఉపాయాలు, అవకాశాలు లేవు కదా.పీరియడ్స్ లో ఒకనాటి స్త్రీ ఎన్నో ఇబ్బందులు పడేది.హైజీన్ సరిగా లేక పీరియడ్స్ లో అమ్మాయిలు గుడికి రాకూడదని అనడం మొదలుపెట్టారు.

Advertisement

కాని ఇదే ముఖ్య కారణం కాదు.అసలు కారణం వేరే ఉంది ఇప్పుడు సీటిల్లో అయినా, పల్లెటూరిలో అయినా, మనుషుల మధ్య బ్రతుకుతున్నాం.

కాని ఒకప్పుడు అంతా అడవిలో, అడవి దగ్గర్లోనే నివసించేవారు.ఇప్పుడు కొన్ని పులులు, సింహాలు, మనకు మెళ్ళ దూరంలో, ఎక్కడో మనుషులు లేని అడవిలో బ్రతుకుతోంటే, చాలావరకు క్రూర జంతువులని మనం జూలో బంధించి ఉంచుతున్నాం.

కాని పూర్వకాలంలో ఎక్కడపడితే అక్కడే కనబడేవి ఈ క్రూర జంతువులు.మనిషి కనబడినా, రక్తం వాసనతో జాడలు తెలిసినా, వాటికి మనిషి ఆహారం కావాల్సిందే.

పీరియడ్స్ లో రక్తం బయటకి రావడంతో, ఒక అమ్మాయి ఆ సమయంలో బయటకి వస్తే, ఆ రక్తం యొక్క వాసనని పసిగట్టి పులులు, సింహాలు ఎక్కడ దాడిచేస్తాయో అని భయపడి, పీరియడ్స్ సమయంలో అసలు అమ్మాయికి బయటకి వెళ్ళనిచ్చేవారు కాదట.అంటే కేవలం గుడికే కాదు, ప్రతి నెల, ఆ సమయంలో అమ్మాయి ఇంటి బయట కాలు కూడా పెట్టేది కాదు అన్నామాట.

అర్జున్ రెడ్డి లాంటి మరో సినిమాలో నటిస్తారా.. షాలిని పాండే రియాక్షన్ ఇదే!
ఇదిగో మిమ్మలనే వింటున్నారా.. రూ.599కే విమాన ప్రయాణమంట తెలుసా?

ఈరకంగా ఈ ఆచారం మొదలైంది అని చెబుతున్నారు చరిత్ర పరిశోధకులు.

Advertisement

తాజా వార్తలు