ప్రొద్దున్నే 3 గంటలకు దెయ్యాలు వస్తాయా?

రాత్రి 12 గంటలు దాటితే బయటకి వెళ్ళకూడదని అంటారు.చుట్టూ చీకటి.

మన గుండెచప్పుడు మనకు గట్టిగా వినిపించేంత నిశ్శబ్దం.

మనుషుల రోజు అప్పుడు అంతమైతే, దెయ్యాల రోజు సరిగ్గా అప్పుడే మొదలవుతుంది అని అంటారు.

మరీ ముఖ్యంగా 3 గంటల ప్రాంతాన్ని "డెవిల్ అవర్" అని అంటారు.అంటే దెయ్యాల సమయం.

ఆ సమయంలో దెయ్యాలు చాలా శక్తివంతంగా ఉంటాయి అని చెబుతూ ఉంటారు.నిజానిజాలు ఎవరికి పూర్తిగా తెలియదు కాని, ఆ 3 గంటల సమయాన్ని డెవిల్ అవర్ గా ఎందుకు అంటారు అనేదానికి ఓ కారణం ఉంది.

Advertisement

ఏసు క్రీస్తు మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు తన ప్రాణాన్ని శిలువపై వదిలారని చెబుతారు.సరిగ్గా దానికి వ్యతిరేకమైన తెల్లవారి 3 గంటలను దెయ్యాల సమయమని చెబుతుంటారు కొంతమంది క్రైస్తవులు.

రాత్రి మూడు గంటల సమయంలో మనిషి, జంతువు అని తేడా లేకుండా అందరు నిద్రపోతారు, బయటకు రావడానికి దెయ్యాలకు అదే సరైన సమయమని మరి కొంతమంది చెబుతూ ఉంటారు.చుట్టూ ప్రశాంతంగా, చీకటిగా ఉండే సమయాన్ని దెయ్యాలు ఇష్టపడతారని కూడా చెబుతారు.

కారణాలు ఏవైనా, ఆ మూడు గంటల సమయం దెయ్యాల సమయమని ప్రపంచమంతా నమ్ముతోంది.సైన్స్ లెక్కలు వేరేలా ఉంటాయి, అది వేరే విషయం.

ఎవరు నమ్మాల్సింది వారు నమ్ముతారు.

అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

Advertisement

తాజా వార్తలు