నిర్మాతతో సుధీర్‌బాబుకు చెడిందా?

సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ సినిమా ఫిబ్రవరిలోనే విడుదల కావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఇప్పుడు విడుదలకు సిద్దం అయ్యింది.

ఈ సినిమా కంటే ఎంత ఆలస్యంగా ప్రారంభించిన సుధీర్‌బాబు ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా విడుదల ఎప్పుడో అయ్యింది.

అయితే కృష్ణమ్మ మాత్రం ఇప్పుడు విడుదల కాబోతుంది.ఈనెల 19న ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు.నిర్మాత లగడపాటి శ్రీధర్‌ మరియు ఇతర చిత్ర యూనిట్‌ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలు పెట్టారు.

అయితే ఈ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో సుధీర్‌బాబు కనిపించక పోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.ఈ సినిమాలో నటించిన హీరోయిన్‌ ప్రెస్‌మీట్‌కు వచ్చింది కాని, హీరో మాత్రం రాక పోవడం ఏంటని మీడియా వారు గుసగుసలాడుకుంటున్నారు.

Advertisement

చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం షూటింగ్‌ సమయంలో నిర్మాతకు మరియు సుధీర్‌బాబుకు విభేదాలు తలెత్తాయని, అందుకే ఆయన ప్రమోషన్‌ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లుగా చెబుతున్నారు.

Lorem Ipsum Dolor Sit Amet
Advertisement