Aishwarya Rai : ఐశ్వర్య, అభిషేక్ డివోర్స్ తీసుకోవడం ఖాయమేనా.. అందుకు బలమైన సూచనలు ఇవే..?

1994లో మిస్ వరల్డ్ టైటిల్ నెగ్గిన ఐశ్వర్య రాయ్( Aishwarya Rai ) బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకుంది.

ప్రస్తుతం ఈ అమ్మడి వయసు 50 ఏళ్లు.

అయినా చాలా అందంగా కనిపిస్తుంటుంది.ఈ విశ్వసుందరిని పెళ్లి చేసుకోవడం అభిషేక్ బచ్చన్ అదృష్టమని చెప్పేవారు ఇప్పటికీ లేకపోలేదు.

అమితాబ్‌ బచ్చన్ కోడలిగా వెళ్లిన ఈ తార వారి కుటుంబంలో 16 ఏళ్లుగా బాగానే ఉండగలిగింది కానీ ఇకపై ఆమె ఉండకపోవచ్చు.ఈ తార బిగ్ బి ఇంటి నుంచి శాశ్వతంగా బయటికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

అభిషేక్ బచ్చన్ నుంచి ఆమె విడాకులు తీసుకోవడం ఖాయం అన్నట్లు ప్రస్తుతం కొన్ని బలమైన సూచనలు కనిపిస్తున్నాయి.

Advertisement

ఐశ్వర్య రాయ్, ఆమె అత్త జయాబచ్చన్ ( Jaya Bachchan )మధ్య పదే పదే గొడవలు అవుతున్నాయని, వారికి అస్సలు పడటం లేదని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.నిజానికి కొన్ని ఏళ్లుగా ఈ అత్తాకోడళ్ల మధ్య ఒక చిన్నపాటి యుద్ధమే నడుస్తోందట.వీరిద్దరూ మాట్లాడుకోకపోయినా సరే శత్రువుల్లాగా ఉంటున్నారట.

ఇద్దరికీ ఒకరిపై ఒకరికి పీకలు దాకా కోపం పెరిగిపోయిందట.జయాబచ్చన్ ఐశ్వర్యని అస్సలు ఓర్వలేక పోతోందట.

బిడ్డ ఆరాధ్య( Aaradhya )ను ఇలాంటి వాతావరణంలో పెంచలేక ఐశ్వర్య నలిగిపోతోందని కొన్ని మీడియా వర్గాలు చెబుతున్నాయి.

అందుకే ఆమె ప్రస్తుతం పుట్టింటికి వెళ్ళిపోయి తన తల్లితో ఉంటుందని కొందరు వార్తలు కూడా రాస్తున్నారు.నవంబర్ 1న ఐశ్వర్య తన 50వ పుట్టినరోజు జరుపుకుంది.ఆ రోజు తన కూతురు తన తల్లితో కలిసి తన బర్త్‌ డే సెలబ్రేషన్స్ చేసుకుంది కానీ అభిషేక్ బచ్చన్ తో గాని లేదా వారి కుటుంబంతో ఎవరితో గానీ ఆమె కలిసి ఫొటోలు సెలబ్రేషన్ చేసుకున్నట్లు ఫోటోలు పెట్టలేదు.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

అభిషేక్ కూడా ఆమెతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేయలేదు.భార్య పుట్టినరోజు వేడుకల్లో తాను ఉన్నట్లు ఎలాంటి మీడియా కంటెంట్ కూడా పంచుకోలేదు.పైగా ఏదో విష్ చేయకపోతే అనుమానాలు వస్తాయన్నట్లు రెండు ముక్కలలో హ్యాపీ బర్త్ డే అంటూ చెప్పేసి సైలెంట్ అయిపోయాడు.

Advertisement

ఇలాంటి సూచనలను చూస్తుంటే వారిద్దరూ త్వరలోనే విడాకులు ప్రకటించే అవకాశం ఉందని కూడా అర్థమవుతుంది.నిజానికి వీరిద్దరూ 16 ఏళ్లుగా కలిసి ఉన్నారు, వారికి ఒక పెద్ద పాప కూడా ఉంది.

అలాంటప్పుడు ఎలా విడాకులు తీసుకుంటారని ప్రశ్న తలెత్తవచ్చు కానీ విడాకులు తీసుకోవడానికి ఐశ్వర్యకు చాలానే కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది కాబట్టి త్వరలో వారు డివోర్స్ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

తాజా వార్తలు