ఒకేసారి ఇద్దరు యువతులతో పెళ్లికి రెడీ.. రంగంలోకి పోలీసుల ఎంట్రీ.. చివరకు?

ఇటీవల సోషల్ మీడియాలో పెళ్లి సంబరాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తెగ వైరల్( photos went viral) అవుతున్నాయి.

ఒక్కోసారి ఇవి భావోద్వేగాలను రేకెత్తిస్తే, మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

అలాంటి ఓ సంఘటన ఇదివరకు తెలంగాణలో చోటుచేసుకొని హాట్ టాపిక్‌గా మారింది.ఒకే వేదికపై ఇద్దరు యువతులతో ఓ యువకుడు వివాహం చేసుకోవడం, అది కుటుంబ సభ్యుల సమక్షంలో జరగడం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.

అయితే సరిగ్గా ఇలాంటి ఘటన ఏపీలో జరగాల్సి ఉండగా.చివరికి చట్టం అడ్డు రావడంతో పెళ్లి రద్దయింది.

అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గమ్మయ్యగారిల్లి(Gammaiyagarilli, Gorantla Mandal, Sri Sathya Sai District) గ్రామానికి చెందిన నిడిగింటి గంగరాజు (Nidiginthi Gangaraju)అనే యువకుడు, చిక్కబళ్లాపురం జిల్లా బాగేపల్లి పట్టణానికి చెందిన ఇద్దరు యువతులతో ఒకేసారి వివాహం చేసుకోబోతున్నాడు.

Advertisement

ఈ వివాహానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.ఎందుకంటే, ఇది సాధారణ పెళ్లి కాదు కదా.! అందుకు.ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఒకేసారి ఒక్కడినే పెళ్లి చేసుకుంటున్నాడన్న వార్త అందర్నీ ఆశ్చర్యపరిచింది.

అయితే, ఈ వివాహ విషయం పోలీసుల దృష్టికి రావడంతో, వారు తక్షణమే వివరాలు సేకరించారు.వధువులు ఇద్దరూ మైనర్లు అని గుర్తించి యువకుడిని అతని కుటుంబాన్ని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.

పిల్లల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం మైనర్ల వివాహాలు నేరం అని, అలాంటి పనులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.దీంతో భయాందోళనకు గురైన గంగరాజు కుటుంబసభ్యులు, చివరికి వివాహాన్ని అధికారికంగా రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు.ఇకపోతే, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూద్దామని ఎదురు చూసిన గ్రామస్థులు, నెటిజన్లకు నిరాశే మిగిలింది.

అయినప్పటికీ, చట్టాన్ని అతిక్రమించి ఎవరూ తప్పిదానికి పాల్పడకూడదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.ఇది కూడా ఒక రకంగా సమాజానికి ఇచ్చే సందేశమే అని చెప్పవచ్చు.పెళ్లి అనే శుభకార్యాన్ని శాస్త్రీయంగా, చట్టబద్ధంగా జరిపించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత కావాలి.

ఉదయాన్నే నీళ్లలో తేనెను కలుపుకొని తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఇది మాత్రమే కాదు, సమాజంలో ఇలాంటి వైరల్ వివాహ సంఘటనలు ఇకపై జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని వలసున్న అవసరం మరింత స్పష్టమవుతోంది.

Advertisement

తాజా వార్తలు