ఇల్లీ పాపపై ఫోకస్ పెట్టిన మాస్ రాజా.. క్యా మత్లబ్ హై?

టాలీవుడ్ మాస్ రాజా రవితేజ ఇటీవల క్రాక్ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

చాలా కాలం తరువాత ఈ సక్సెస్ రావడంతో రవితేజ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి చేస్తూ దూసుకుపోతున్నాడు.

ఇప్పటికే దర్శకుడు రమేష్ వర్మ డైరెక్షన్‌లో ఖిలాడి అనే కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు రవితేజ.ఇక ఈ సినిమాలో రవితేజ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతుండగా, ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యింది.

అయితే ఈ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే రవితేజ తన నెక్ట్స్ మూవీతో దూసుకుపోతున్నాడు.దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు మాస్ రాజా.

ఈ సినిమాలో రవితేజ ఓ ప్రభుత్వ ఉద్యోగిగా మనకు కనిపిస్తాడట.అయితే ఈ సినిమాలో రవితేజ అభిమాను కోసం ఓ పవర్‌ఫుల్ మాస్ మసాలా పాటను పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.

Advertisement

అందుకోసం ఎవరిని తీసుకుంటే బాగుంటుందా అని అందరూ ఆలోచిస్తుండగా, రవితేజ గోవా బ్యూటీ ఇలియానా పేరును రికమెండ్ చేశాడట.గతంలో ఇలియానాతో తనకున్న స్నేహం కారణంగా ఆమె పేరును రవితేజ రిఫర్ చేశాడని చిత్ర యూనిట్ అంటోంది.

అసలే సినిమా ఛాన్సులు లేక బాధపడుతున్న ఇలియానాకు ఇది బంపరాఫర్ అని చెప్పాలి.ఐటెం సాంగ్ అయినా క్లి్క్ అయితే ఆమెకు వరుసగా సినిమా ఛాన్సులు వచ్చే అవకాశం ఉంటుందని చిత్ర యూనిట్ ఆశిస్తుంది.

మరి ఐటెం సాంగ్ కోసం రవితేజ రికమెండ్ చేసిన ఇల్లీ పాప ఒప్పుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.తాను కేవలం హీరోయిన్ పాత్రలే చేస్తానంటూ డిమాండ్ చేస్తే మాత్రం అమ్మడికి ఇక్కడ కూడా ఎదురుదెబ్బ తగలడం ఖాయమని అంటున్నారు సినీ విమర్శకులు.

తాజా వార్తలు