'రావణాసుర' ఈ రోజు మిస్ అయితే కష్టమేనా.. రెండోరోజు దారుణమైన కలెక్షన్స్!

మాస్ మహారాజా రవితేజ ( Ravi Teja ) గత రెండు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు.

ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలతో చాలా రోజుల తర్వాత వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత మాస్ రాజా నుండి వచ్చిన నెక్స్ట్ మూవీ రావణాసుర( Ravanasura ) . ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని ఆశ పడ్డ రవితేజకు మరో ప్లాప్ ఎదురైంది.తాజాగా రవితేజ హీరోగా సుధీర్ వర్మ ( Sudhir Verma) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ అవైటెడ్ మూవీ రావణాసుర.

ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూసారు.మరి అందరి ఎదురు చూపుల మధ్య ఈ సినిమా ఏప్రిల్ 7న పాన్ ఇండియా వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ఇక ఈ సినిమాలో మాస్ రాజాకు జోడీగా ఐదుగురు హీరోయిన్స్ నటించారు.అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్ లు నటించగా.హర్ష వర్ధన్, భీమ్స్ సిసిరోలియా సంగీతం అందించారు.

Advertisement

అక్కినేని హీరో సుశాంత్ ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపించి ఆకట్టు కున్నాడు.ఈ సినిమా మరీ యాక్షన్ ఎక్కువ కావడంతో ఫస్ట్ డే నుండే మిక్సెడ్ టాక్ వచ్చింది.

అయితే మొదటి రోజు ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ( Ravanasura Box Office Collections) నే అందుకుందని తెలిసింది.మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల 29 లక్షలను రాబట్టిన ఈ సినిమా రెండవ రోజు కేవలం 2 కోట్లతోనే సరిపెట్టుకుంది.రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 6 కోట్ల 54 లక్షల షేర్ రాబట్టగా 10.75 కోట్ల గ్రాస్ రాబట్టింది.ప్రపంచ వ్యాప్తంగా అయితే 7.80 కోట్ల షేర్ రాబట్టగా 13.70 గ్రాస్ రాబట్టింది.వీకెండ్ ఏమైనా వసూళ్లు వస్తే తప్ప గట్టెక్కడం కష్టమేనని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు