Ravi Teja : మహేష్, బన్నీ బాటలో రవితేజ.. ఆ ఏరియాలో మల్టీప్లెక్స్ తో కళ్లు చెదిరే లాభాలు ఖాయమా?

టాలీవుడ్ స్టార్ హీరోలు అయినా మహేష్ బాబు, అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ థియేటర్ లను ప్రారంభించిన విషయం తెలిసిందే.

మొదట మహేష్ బాబు ఏఎంబి మల్టీప్లెక్స్ నిర్మించగా,ఆ తరువాత అల్లు అర్జున్ ఏఏఏ మల్టీప్లెక్స్ ను నిర్మించారు.

ఇప్పుడు మహేష్ బాబు బెంగళూరులో మళ్లీ ఏఎంబి మల్టీప్లెక్స్ ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) తో కలిసి ఒక థియేటర్ ఏర్పాటు చేసారు.

అయితే ఇప్పుడు మాస్ మహరాజా రవితేజ వంతు వచ్చింది.దిల్ సుఖ్ నగర్‌లో ఒక మల్టీ ఫ్లెక్స్ ను రవితేజ ఆసియన్ సినిమాస్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబోతున్నారు.

ఈ మల్టీ ఫ్లెక్స్ లో ఆరు స్క్రీన్ లు ఉంటాయి.ప్రస్తుతం ఈ కాంప్లెక్స్ నిర్మాణంలో వుంది.మరి కొద్ది రోజుల్లో నిర్మాణం పూర్తవుతుంది.

Advertisement

ఆసియన్ సినిమా( Asian cinema )స్ సంస్థ రకరకాల భాగస్వామ్యాలతో థియేటర్ల నిర్మాణం చేపడుతోంది.కాగా గతంలో సింగిల్ స్క్రీన్ ల లీజ్ మీద దృష్ఠి పెట్టిన ఈ సంస్థ ఇప్పుడు మల్టీ ఫ్లెక్స్ ల మీద దృష్టి సారించింది.

జనాల అభిరుచి మారుతుండడం వల్ల మల్టీ ఫ్లెక్స్ స్క్రీన్ లు ఎక్కువగా అక్వైర్ చేసే ఆలోచనలో ముందుకు సాగుతోంది.అందులో భాగంగానే సిటీలో పలు చోట్ల మల్టీ ఫ్లెక్స్ లు ఏర్పాటు చేయబోతొంది.

అయితే ఇప్పుడు రవితేజ( Ravi Teja ) అల్లు అర్జున్ మహేష్ బాబు బాటలోనే పయనిస్తున్నాడు.రవితేజ మహేష్ బాబులు ఇప్పటికే మల్టీప్లెక్స్ లను నిర్మించడంతో పాటు వాటి నుంచి భారీగా ఆదాయాలను పొందుతున్న విషయం తెలిసిందే.

ఇక త్వరలోనే రవితేజ కూడా ఇదే బాటలో పయనించనున్నాడు.మరి మల్టీప్లెక్స్లతో వరవి చేత కళ్ళు చెదిరే విధంగా లాభాలు పొందుతారా లేదా అన్నది తెలియాలి అంటే మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే మరి.ఇకపోతే మాస్ మహారాజా రవితేజ విషయానికి వస్తే.రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

ఇటీవలే ఈగల్ సినిమా( Eagle )తో ప్రేక్షకులను పలకరించారు.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Advertisement

సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్నారు రవితేజ.తాజాగా విడుదలైన ఈగల్ సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు