మాస్ మహా రాజా కరోనా తర్వాత ఫుల్ జోష్ గా మారిపోయాడు.ఆయన ప్రస్తుతం ఐదారు సినిమాలతో బిజీగా ఉన్నాడు.
క్రాక్ కిరాక్ హిట్ అవ్వడంతో ఈయనకు మళ్ళీ మంచి రోజులు మొదలయ్యాయి.రెమ్యునరేషన్ పెంచిన కూడా రవితేజ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు.
ఈయన ఏకంగా పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.ఇటీవలే చేసిన ఖిలాడీ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేక పోయింది.
ఈ సినిమా తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధమాకా సినిమా చేస్తున్నాడు.ఇక వీటితో పాటు శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ, అలాగే స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర సినిమాను చేస్తున్నాడు.
ఇంకా వంశీ కృష్ణ దర్శకత్వంలో స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తెరకెక్కనుంది.టైగర్ నాగేశ్వరరావు టైటిల్ తో ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.1970 స్టువర్ట్ పురంలో పేరుమోసిన గజదొంగ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నారని తెలుస్తుంది.
అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక వార్త బయటకు వచ్చింది.ఈ సినిమా స్టోరీ రవితేజ కంటే ముందు చాలా మంది హీరోల చేతులు మారిందని డైరెక్టర్ వంశీ మెగాస్టార్ చిరంజీవికి కూడా ఈ స్క్రిప్ట్ వినిపించాడని టాక్.
ఈ విషయాన్నీ స్వయంగా చిరు వెల్లడించారు.ఈ కథ వంశీ నాకు వినిపించాడని.కథ బాగా నచ్చిందని అన్నారు.
ఈ సినిమాలో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయని క్యారెక్టరైజేషన్ కూడా బాగుందని.కానీ ఏదో కుదరక తాను చేయలేదని.
ఇది రవితేజకు సరిగ్గా సరిపోతుందని తెలిపారు.
అయితే మెగాస్టార్ తన ఇమేజ్ కు సూట్ కాదని రిజక్ట్ చేసాడని.అలాగే ఈ కథ చిరుకు మాత్రమే కాదు చాలా హీరోల దగ్గరికి వెళ్లి చివరకు రవితేజ వద్దకు వచ్చిందని అంటున్నారు.మరి చిరు వద్దని రిజక్ట్ చేసిన సినిమా ఇప్పుడు రవితేజ చేస్తున్నారు.
మరి ఈ కథతో రవితేజ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.ఇక ఇటీవలే చిరు చేతుల మీదుగానే ఈ సినిమా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే.
ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy