రామారావు పుకార్లకు చెక్‌... రిలీజ్ డేట్‌ పై ఇదే క్లారిటీ

ఖిలాడి సినిమా తో ప్లాప్ అయిన రవితేజ నుండి తదుపరి రాబోతున్న సినిమా రామా రావ్ ఆన్ డ్యూటీ.

ఈ సినిమా కు శరత్‌ మండవ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించాడు.

రవితేజ సొంత బ్యానర్‌ లో ఈ సినిమా రూపొందింది.సినిమాకు సంబంధించిన నిర్మాణ వ్యవహారాల్లో రవితేజ ఉండటంతో ఖచ్చిం గా సినిమా బాగుంటుంది అనే అభిప్రాయం చాలా మంది లో కనిపిస్తుంది.

ఆ విషయం పక్కన పెడితే రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాను గత ఏడాది లోనే పట్టాలెక్కించారు.ఈ ఏడాది ఆరంభం లో సినిమా ను విడుదల చేస్తాం అంటూ యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు.

కాని ఇప్పటి వరకు సినిమా ను విడుదల చేయలేదు.ఇటీవల ఒక డేట్‌ ను అనుకున్నారు.

Advertisement

కాని విడుద తేదీ దగ్గర పడ్డ తర్వాత క్యాన్సిల్‌ చేశారు.ఖిలాడి సినిమా ప్లాప్ అవ్వడం వల్లే ఆ సినిమా తాలూకు ప్రభావం ఈ సినిమా పై పడి విడుదలకు అడ్డంకులు ఎదురు అవుతున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

సోషల్‌ మీడియా లో పెద్ద ఎత్తున ఈ సినిమా గురించి పుకార్లు షికార్లు అవుతున్నాయి.కాని ఇప్పటి వరకు రామారావు ఆన్ డ్యూటీ విడుదల తేదీ గురించి క్లారిటీ ఇవ్వడం లేదు అంటూ ఉండగా అనూహ్యంగా విడుదల తేదీకి సంబంధించిన అప్డేట్‌ ను ఇవ్వబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

అదుగో ఇదుగో అంటూ రామారావ్‌ ఆన్ డ్యూటీ ని విడుదల వాయిదా వేస్తూ వస్తున్నారు.ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదల విషయంలో ఒక స్పష్టత ఇచ్చేందుకు రేపు ఒక స్పెషల్‌ పోస్టర్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రవితేజ ఈ సినిమా లో ఒక ప్రభుత్వ ఉద్యోగి గా కనిపించబోతున్న విషయం తెల్సిందే.

కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!
Advertisement