చిరంజీవిపై విమర్శలకు రవితేజ స్పందించాలంటూ మెగా ఫాన్స్ డిమాండ్

మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా యొక్క విజయోత్సవ వేడుకలో మాట్లాడుతూ రవితేజ ను చిన్న హీరో అంటూ మాటల మధ్య లో సంబోధించడం జరిగింది.

దాంతో రవితేజ అభిమానులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు.

వంద కోట్ల హీరో అయిన రవితేజ ను ఎలా చిన్న హీరో అంటారు అంటూ విమర్శలు చేస్తున్నారు.అంతే కాకుండా రవితేజ వల్లే వాల్తేరు వీరయ్య సినిమా ఆడింది.

ఇంకా ఆడుతుంది అంటూ కొందరు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చిరంజీవి పై విమర్శలు చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు.

చిరంజీవి యాంటీ ఫ్యాన్స్‌ ఈ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రవితేజ స్పందించాల్సిన అవసరం ఉంది అంటూ మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.ఒకప్పుడు చిరంజీవి సినిమా లో నటించడం వల్లే రవితేజ ఈ స్థాయికి వచ్చాడు.ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాల్సిందే.

Advertisement

రవితేజ కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటాడు.అలాంటిది రవితేజ ఇప్పుడు చిరంజీవి ఒక్క మాట చిన్న హీరో అనగానే ఆయన స్థాయి తగ్గదు మరియు చిరంజీవి స్థాయి పెరగదు.

కనుక చిరంజీవి వ్యాఖ్యలపై రవితేజ స్పందించాలని.చిరంజీవి మాటలకు తన అభిమానులు అతిగా రియాక్ట్‌ అవ్వాల్సిన అవసరం లేదు అన్నట్లుగా సమాధానం చెప్పాలని మెగా ఫ్యాన్స్‌ అంటున్నారు.

రవితేజ ఈ విషయమై స్పందిస్తేనే యాంటీ మెగా ఫ్యాన్స్ మరియు రవితేజ ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో చిరంజీవి పై విమర్శలు తగ్గిస్తారు అనేది చాలా మంది అభిప్రాయం.రవితేజ ఈ విషయమై ఎలా స్పందించాలో అర్థం కాక ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.ఇక చిరంజీవి వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందిగా మెగా ఫ్యాన్స్ డిమాండ్‌ చేస్తున్నారు.

మరి చిరంజీవి అయినా స్పందిస్తాడా అనేది చూడాలి.ఈ పరిస్థితుల నేపథ్యంలో మరే హీరో సినిమా లో కూడా రవితేజ నటించవద్దని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ సినిమాతోనైనా భావన కెరీర్ గాడిలో పడుతుందా.?
Advertisement

తాజా వార్తలు