మరో యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన మాస్ రాజా.. ఎవరంటే?

యువతరాన్ని ప్రోత్సహించడంతో మన టాలీవుడ్ హీరోలు ముందు వరుసలో ఉంటారు.ట్యాలెంట్ ఉండాలి కానీ వరుస అవకాశాలు ఇవ్వడానికి ఎప్పుడు హీరోలు సిద్ధంగానే ఉంటారు.

కథ చెప్పి వారిని మెప్పించ గలిగితే చాలు.మరి అలాంటి హీరోల్లో మాస్ రాజా రవితేజ కూడా ఒకరు.

ఈయన కూడా ఎప్పుడు యువ దర్శకులకు అవకాశాన్ని ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు.ఇప్పటికే చాలా మందికి అవకాశం ఇచ్చిన మాస్ రాజా మరోసారి మరొక యంగ్ డైరెక్టర్ కు అవకాశం ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది.

ఈయన ప్రెసెంట్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు.త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధమాకా సినిమా చేస్తున్నాడు.

Advertisement
Ravi Teja Gives Chance To A Young Director, Raviteja ,Tiger Nageswara Rao, 30 Ro

దీంతో పాటు శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ.అలాగే స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర సినిమాను చేస్తున్నాడు.

ఇంకా వంశీ కృష్ణ దర్శకత్వంలో స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసి శరవేగంగా పూర్తి చేస్తున్నారు.ఇన్ని సినిమాలు చేస్తున్న కూడా రవితేజ మరొక యంగ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ఎంతో మంది కొత్త డైరెక్టర్లతో రవితేజ సినిమాలు చేసాడు.

Ravi Teja Gives Chance To A Young Director, Raviteja ,tiger Nageswara Rao, 30 Ro

ఇక ఇప్పుడు మరొక డైరెక్టర్ కు కూడా ఛాన్స్ ఇచ్చి ఈయన కొత్తతరాన్ని ఎప్పుడు ప్రోత్సహిస్తాడు అని మరోసారి రుజువు చేసుకున్నాడు. యాంకర్ ప్రదీప్ ని హీరోగా పరిచయం చేస్తూ తీసిన సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ఈ సినిమాను డైరెక్టర్ మున్నా దర్శకత్వంలో తెరకెక్కింది.మరి ఇప్పుడు ఈ డైరెక్టర్ తోనే రవితేజ సినిమ చేసేందుకు ఓకే చెప్పాడట.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

త్వరలోనే ఈ విషయంపై అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు