రవితేజ ధమాకా పరిస్థితి ఏంటీ భయ్యా... రిలీజ్ ఎప్పుడు?

రవితేజ హీరోగా రూపొంది ఆమద్య వచ్చిన ఖిలాడి సినిమా నిరాశ పర్చింది.

ఆ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమా లు వచ్చే అకవాశం ఉన్నా కూడా కాస్త సైలెంట్‌ గా రవితేజ ఉన్నాడు.

పెద్ద ఎత్తున సినిమా లను విడుదల చేయడం వల్ల ఆర్థికంగా బిజినెస్ పరంగా కాస్త ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.అందుకే రవితేజ తన సినిమా ల జోరును స్పీడ్ ను కాస్త తగ్గించాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అందులో భాగంగానే రవితేజ ధమాకా సినిమా ను వాయిదా వేశారు అంటున్నారు.ఇప్పటికే విడుదల కావాల్సిన ధమాకా సినిమాను వచ్చే నెలకు వాయిదా వేయడం జరిగింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

తాజాగా హీరోయిన్ శ్రీ లీలా పుట్టిన రోజు జరిగింది.ఆ సినిమా లో రవి తేజ కు జోడీగా శ్రీ లీలా నటించింది.

Advertisement

కనుక ఆమె కు హ్యాపీ బర్త్‌ డే చెబుతూ కొత్త పోస్టర్ ను విడుదల చేయలేదు.కనుక రవితేజ అభిమానులు ధమాకా సినిమా విడుదల తేదీ విషయంలో గందరగోళంలో ఉన్నారు.

పెద్ద ఎత్తున అంచనాలున్న ధమాకా సినిమాను ఇలా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఉండటంను జీర్ణించుకోలేక పోతున్నాం అంటూ కామెంట్స్ వస్తున్నాయి.సోషల్‌ మీడియాలో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తు ఎప్పుడు ధమాకా సినిమా ను విడుదల చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

అసలు మీరు ఎప్పుడు సినిమా ను విడుదల చేస్తారు అంటూ ఆగ్రహం తో ఉన్నారు.

ధమాకా సినిమా ను విడుదల చేయడం కోసం రవితేజ ఏ విషయం లో వాయిదా లు వేస్తున్నాడు అర్థం కావడం లేదు అంటున్నారు.ఆయన నటించిన రావణాసుర.టైగర్ నాగేశ్వరరావు ఇంకా రెండు మూడు సినిమా లు కూడా వచ్చే ఏడాది లో విడుదల కాబోతున్నాయి.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

ఈ సినిమా ఈ ఏడాది చివరి వరకు విడుదల కాకుండా వాయిదా వేస్తారా అంటూ చర్చ జరుగుతోంది.ఇక హీరోగా ధమాకా సినిమా తో రవితేజ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు