మాస్ రాజా కెరీర్ లో బెస్ట్ కామెడీ సీక్వెన్స్ ఇదేనట.. 'ధమాకా' హిట్ ఇవ్వబోతున్నాడా?

మాస్ మహారాజా కెరీర్ లో ఎప్పుడు జెట్ స్పీడ్ తోనే దూసుకు పోతాడు.ఏడాదికి మూడు నాలుగు సినిమాలను పక్కాగా విడుదల చేస్తాడు.

ఈయన గ్యాప్ లేకుండా సినిమాలు అనౌన్స్ చేసి అంతే వేగంగా షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు.ఇటీవలే రమేష్ వర్మ దర్శకత్వంలో చేసిన ఖిలాడీ సినిమా రిలీజ్ అయ్యింది.

కానీ అనుకున్నంత హిట్ అయితే అవ్వలేదు.ఆ తర్వాత రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.

శరత్ మండవ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే మరొక సినిమాను ప్రకటించాడు.

Advertisement

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ధమాకా సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు.ఈ సినిమాను కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ లు అద్భుతంగా ఉంటాయట.ఫుల్ ఫన్ తో నవ్వులు పంచుతుందని.

రవితేజ కెరీర్ లోనే ఈ సీక్వెన్స్ బెస్ట్ కామెడీ సీక్వెన్స్ అవుతుందని టాక్ వినిపిస్తుంది.మరి అంతగా చెబుతున్నారు అంటే కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో తెలుస్తుంది.

మరి ఈ సినిమాలో కామెడీ టైమింగ్ తో రవితేజ ఎలా అలరిస్తాడో వేచి చూడాల్సిందే.ఇక ఈ సినిమాలో రవితేజ కు జోడీగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుంది.

విష్ణువు వరాహవతారం ఎత్తడానికి గల కారణం ఇదే..!

రవితేజ ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడు.ఇటీవలే ఈ సినిమా హైదరాబాద్ లో వరుసగా నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.

Advertisement

ఆ తర్వాత స్పెయింట్ కూడా చుట్టేసి వచ్చారు.

తాజా వార్తలు