భారీ ధరకు అమ్ముడైన ''రావణాసుర'' రైట్స్.. మాస్ రాజా అదుర్స్!

మాస్ మహారాజా రవితేజ వరుసగా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి కెరీర్ లోనే మంచి ఫామ్ లో ఉన్నాడు.

గత డిసెంబర్ లో ధమాకా సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.

ఈ సినిమా మాస్ రాజా కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ సినిమా విజయాన్ని రవితేజ ఎంజాయ్ చేస్తున్న తరుణంలోనే మరో హిట్ అందుకున్నాడు.

సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి రవితేజ నటించిన మల్టీ స్టారర్ సినిమా వాల్తేరు వీరయ్య పండుగ కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ సినిమాతో కూడా హిట్ అందుకున్న రవితేజ ఇక తన లైనప్ లో ఉన్న సినిమాల షూటింగులను పూర్తి చేస్తున్నాడు.

ప్రెజెంట్ రవితేజ లైనప్ లో ఉన్న చిత్రాల్లో ముందుగా రిలీజ్ కాబోతున్న సినిమా రావణాసుర.ఈ సినిమాను సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.

Advertisement

ఈ సినిమా నుండి ఈ రోజు రవితేజ పుట్టిన రోజు కానుకగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది.సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ను నేడు రవితేజ 55వ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసారు.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

జీ నెట్ వర్క్ ఈ స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకోగా.శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు తీసుకున్నట్టు తెలిసింది.మరి వరుస హిట్స్ కారణంగానే ఈ సినిమా రైట్స్ భారీ ధర పలికినట్టు తెలుస్తుంది.

ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో మాస్ రాజాకు జోడీగా అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్ లు నటిస్తుండగా అభిషేక్ పిక్చర్స్, ఆర్టి టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక అక్కినేని హీరో సుశాంత్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్నాడు.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి
Advertisement

తాజా వార్తలు