రష్మిక నోటి దూల... ఆ విషయంలో సౌత్ కన్నా బాలీవుడ్ బెటర్ అంటూ కామెంట్స్!

రష్మిక మందన్న ఈ మధ్యకాలంలో వరుస వివాదాలను ఎదుర్కొంటుంది.

అయితే కేవలం ఈమె నోటి దూల కారణంగా తను చేసే కామెంట్స్ వల్ల పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కు కొంటూ దారుణంగా ట్రోలింగ్ గురి అవుతుంది.

గత కొద్ది రోజుల క్రితం కాంతార సినిమా విషయంలో ఈమె చేసినటువంటి కామెంట్స్ ఎంతటి వివాదాన్ని సృష్టించాయో మనకు తెలిసిందే.కాంతార సినిమా చూశారా అని మీడియా అడగడంతో నాకు అంత సమయం లేదంటూ ఈమె చెప్పిన సమాధానం పలు వివాదాలకు కారణమైంది.

ఇక ఈ సినిమా వివాదం ముగియకుండానే రష్మిక మరోసారి సౌత్ సినీ ఇండస్ట్రీ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.రష్మిక పుష్ప సినిమాలో నటించిన అనంతరం ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె నటించిన మిషన్ మజ్ను సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి సాంగ్ ప్రమోషన్ కార్యక్రమంలో రష్మిక పాల్గొన్నారు.

Advertisement

ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె మాట్లాడుతూ.రొమాంటిక్ సాంగ్స్ ను తెరకెక్కించడంలో బాలీవుడ్ ది బెస్ట్ అంటూ బాలీవుడ్ సినిమాలపై ప్రశంసలు కురిపించడమే కాకుండా సౌత్ ఇండస్ట్రీని కించపరిచారు.సౌత్ లో ఎక్కువగా మాస్ మసాలా కమర్షియల్ హంగులే ఉంటాయంటూ సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడారు.

దీంతో ఒక్కసారిగా రష్మిక మరోసారి నేటిజన్ల ట్రోలింగ్ కు గురైంది.కన్నడ నుంచి తెలుగు తమిళ భాషలలో నటించేటప్పుడు కన్నడ చిత్రాలను తక్కువ చేసి మాట్లాడావు.ఇప్పుడు బాలీవుడ్ సినిమాలలో నటించేటప్పటికి సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడుతున్నావ్.

ఇప్పుడు ఇండస్ట్రీలో సౌత్ సినిమాల హవా నడుస్తుంటే నీకు మాత్రం బాలీవుడ్ సినిమాలు నచ్చాయా అంటూ నెటిజెన్స్ రష్మికను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు : రాష్ట్ర మంత్రులు
Advertisement

తాజా వార్తలు