నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె అనంతరం వరస భాష చిత్రాలలో నటిస్తూ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగడమే కాకుండా ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ చిత్రాలలో అవకాశాలు అందుకొని వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక తాజాగా తన అసిస్టెంట్ సాయిబాబు వివాహ వేడుకలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.ఈ విధంగా రష్మిక ఈ పెళ్లి వేడుకలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇలా ఈ పెళ్లి వేడుకలలో రష్మిక సందడి చేయడంతో వధూవరులు ఇద్దరు కూడా రష్మిక కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే ఈ పెళ్లి వేడుకలలో భాగంగా రష్మిక ఆరెంజ్ రంగు చీర ( Rashmika Orange Colour Saree ) ధరించి వచ్చారు.ఇలా ఈ చీరలో రష్మిక సింపుల్ గా ఉన్నప్పటికీ చాలా స్టైలిష్ గా కనిపించారు.
ఈ విధంగా అసిస్టెంట్ పెళ్లి( Rashmika Assistant Marriage ) వేడుకలలో రష్మిక కట్టుకున్నటువంటి ఈ చీరను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనిత డోంగ్రి డిజైన్ చేశారు.
మరి ఈ పెళ్లి వేడుకలలో భాగంగా ఈమె కట్టుకున్నటువంటి ఈ చీర ఖరీదు ఎంత అని నెటిజన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు.అయితే ఈ చీర ఖరీదు తెలిసి ఒక్కసారిగా కంగుతిన్నారు.చూడటానికి చాలా సింపుల్ గా కనిపించిన ఈ చీర మాత్రం చాలా కాస్ట్లీ గురు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరి రష్మిక కట్టిన ఈ చీర విలువ ఎంత అనే విషయానికి వస్తే.చూడటానికి చాలా సింపుల్ గా కనిపించిన ఈ చీర ఏకంగా 35 వేల రూపాయల ధర అని తెలియడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.
అయితే సెలబ్రిటీలు ఇలాంటి డిజైనర్ డ్రెస్సులను ఖరీదైన బ్రాండెడ్ దుస్తులను ఉపయోగించడం సర్వసాధారణం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy