నేనేం రాత్రికి రాత్రి స్టార్ అవ్వలేదు.. ఏడేళ్ల కష్టం ఇది.. రష్మిక?

“ ఛలో " చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు రష్మిక.

మొదట్లో సినిమా ఆఫర్స్ లేకపోయినా అదేమీ లెక్కచేయకుండా నటనపై ఉన్న మక్కువతో తన గుర్తింపు కోసం నిరంతరం కష్టపడింది రష్మిక.

ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లారు ఈ భామ.అప్పట్లో విజయ్ దేవరకొండ తో రిలేషన్ లో ఉన్నట్లు పలు వార్తలు రాగా వాటన్నిటిని కొట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.సినిమా కెరియర్ పై మక్కువ చూపి కోలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు గుర్తింపు పొందారు రష్మిక.

అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రష్మిక తన కెరీర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఆ కామెంట్ల గురించే చిత్రసీమలో చర్చ నడుస్తుంది.

ఓ కథానాయకకి భాషా పరమైన హద్దులను నేనెప్పుడూ ఫీల్‌ కాలేదు అంటుంది రష్మిక మందన్నా.రాత్రికి రాత్రే నాకు సక్సెస్‌ రాలేదు.

Advertisement

ఏడేళ్లుగా నుండి కష్టపడుతున్నాను. ప్రాంతం, భాష ఆధారంగా కొందరు సినిమాను విభజించి చూస్తారు.

కానీ అటువంటి విభేదం లేదు అంటూ నటనపై పట్టు ఉన్నప్పుడు నా భావోద్వేగాలు ప్రేక్షక అభిమానులకు అర్థం అయ్యేలా నటించడానికి భాష హద్దు కాదని భావిస్తాను అని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన పుష్పతో రష్మిక క్రేజ్ అమాంతంగా పెరిగిందని చెప్పుకోవాలి.భాషతో సంబంధం లేకుండా వివిధ భాషల్లో అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపారు.అయితే కరోనా కారణంగా ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని తెలిపారు.

హిందీలో గుడ్ బై, మిషన్‌ మజ్ను విడుదలకు ముస్తాబ్ అవుతున్నాయి.పుష్ప పార్ట్ 2 లో నటిస్తుండగా… తమిళంలో మరో ప్రాజెక్టు చేస్తున్నట్లు తెలిపారు.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?

అలానే వారసుడు’, ‘యానిమల్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నారు రష్మిక.చూడాలి మరి ఈ ఏడాదిలో ఎన్ని సినిమాలు విడుదల కానుందో… వాటిలో ఎన్ని సినిమాలు విజయం సాధిస్తాయో అని తెలియాలంటే ఏడాది వరకు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు