నీకు నటన రాదు అంటూ అవమానించారు.. కెరియర్ తొలినాళ్ళను గుర్తు చేసుకున్న రష్మిక!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ( Rashmika Mandanna ) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచే హీరోయిన్గా పరిచయమైన ఈమె అనంతరం తెలుగు సినిమా అవకాశాలను అందుకున్నారు.

ఇక తెలుగులో ఈమె నటించిన సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి.ఇక అల్లు అర్జున్ ( Allu Arjun ) తో కలిసి పుష్ప ( Pushpa ) సినిమాలో నటించడం ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వచ్చింది.

Rashmika Interesting Comments On Her Problem Initial Days ,rashmika,pushpa 2, Al

ఇక ఈ సినిమా తర్వాత రష్మిక బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు.ఇలా బాలీవుడ్ సినిమాలతో పాటు ఇతర పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.ఇక సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకొని రష్మిక తాజాగా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో తాను ఎదుర్కొన్న అవమానాలను తెలియజేస్తూ చేసిన కామెంట్స్  ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Rashmika Interesting Comments On Her Problem Initial Days ,rashmika,pushpa 2, Al

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రష్మిక కెరియర్ మొదట్లో తాను ఇంకెన్నో అవమానాలను ఎదుర్కొన్నానని తెలిపారు.ఏదైనా సినిమా అవకాశం కోసం ఆడిషన్ కి వెళ్తే అక్కడ తనని చూసి చాలామంది అవమానించేవారు.నటనకు పనికొచ్చే మొహమేనా నీది నువ్వు నటనకు పనికిరావు అంటూ చాలా దారుణంగా మాట్లాడేవారు.

Advertisement
Rashmika Interesting Comments On Her Problem Initial Days ,Rashmika,Pushpa 2, Al

ఇలా ఆడిషన్ కి వెళ్ళిన ప్రతిసారి కన్నీటితోనే తిరిగి వెనక్కి వచ్చే దానినని ఈమె తెలిపారు.ఇలా ఓ సినిమాకు సుమారు పదిసార్లు ఆడిషన్ ఇవ్వగా సెట్ అయ్యానని కానీ మూడు నెలల షూటింగ్ తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలిపారు.

ఇలా ఎన్నో అవమానాలను ఎదుర్కొని అవకాశాలను అందుకొని నటనలో నన్ను నేను మెరుగుపరుచుకుంటూ ఈ స్థాయికి వచ్చానని రష్మిక వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు