నా కారణంగానే బన్నీకి దెబ్బలు తగిలాయి... రష్మిక సంచలన వ్యాఖ్యలు!

రష్మిక( Rashmika ) అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప 2( Pushpa 2 ) .

ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది ఇప్పటివరకు ఈ సినిమా సుమారు 1700 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకొని అల్లు అర్జున్ సరికొత్త రికార్డులను అందుకుంటున్నారు.అదేవిధంగా మరోవైపు ఈయన వివాదంలో చిక్కుకొని జైలుకు కూడా వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో రష్మిక శ్రీవల్లి (Srivalli) పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.

Rashmika Interesting Comment On Allu Arjun , Rashmika, Allu Arjun, Pushpa 2, Pee

రష్మిక శ్రీవల్లి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు ఈ పాత్ర ఆమె కెరియర్ లో ఎప్పటికీ గుర్తుండి పోయే పాత్ర అని చెప్పాలి.ఇక ఈ సినిమాలో భర్త మీద అమితమైన ప్రేమను చూపించే ఓ భార్య పాత్రలో రష్మిక అద్భుతంగా నటించారు.ఇక ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున ప్రమోషన్లలో పాల్గొన్న రష్మిక ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Advertisement
Rashmika Interesting Comment On Allu Arjun , Rashmika, Allu Arjun, Pushpa 2, Pee

ఈ సినిమా షూటింగ్ సమయంలో కొన్నిసార్లు తాను భయాందోళనలకు గురి అయినట్లు రష్మిక ఇది వరకు వెల్లడించారు.

Rashmika Interesting Comment On Allu Arjun , Rashmika, Allu Arjun, Pushpa 2, Pee

ముఖ్యంగా పీలింగ్స్ సాంగ్ షూటింగ్ సమయంలో బన్నీ సార్ నన్ను అలా ఎత్తుకొని డాన్స్ చేసేటప్పుడు చాలా భయపడ్డాను నాకు చిన్నప్పటి నుంచి ఎవరైనా పైకి ఎత్తితే ఎక్కడి కింద పడేస్తారో అనే భయం నాలో ఉండేది ఆ భయం కారణంగానే కాస్త అభద్రత భావానికి గురి అయ్యానని తెలిపారు.అదేవిధంగా ఈ పాట షూటింగ్ సమయంలో నా గాజు పగిలి బన్నీ సర్ చేతికి గాయమైందని ఆ గాయం కారణంగా ఆయనకు రక్తస్రావం జరుగుతున్నప్పటికీ షూటింగ్ పైనే ఫోకస్ చేశారని తెలిపారు.ఇలా నా కారణంగా అల్లు అర్జున్ సర్ బాధపడ్డారు అంటూ తాజాగా రష్మిక చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు