Rashmika Mandanna : రష్మిక తెలివి మాములుగా….అక్కడ కర్చీఫ్ వేసి ఇక్కడ కూడా పాగా వేస్తున్నావా ?

రష్మిక మందన్న( Rashmika Mandanna ) నేషనల్ క్రష్ గా మొదటి నుంచి మంచి క్రేజ్ అయితే సంపాదించుకుంది కానీ తెలుగు లో గీత గోవిందం అనే హిట్ పడే వరకు ఆమె ఎవరో ఎవరికి తెలియదు.

అప్పుడే ఆమె పెళ్ళికి కూడా సిద్ధం అయిపోయి ఉంది కానీ తెలుగు లో ఆమెకు స్కోప్ ఎక్కువగా కనిపించడం తో ఇక పెళ్లి కూడా వద్దనుకుని సినిమాలతో బిజీ అయిపొయింది.

అల్లు అర్జున పుష్ప సినిమా ద్వారా మొత్తానికి నేషనల్ స్టార్ గా మారిపోయింది.తెలుగు లో ఎన్ని సినిమాలు తీసిన రాని పేరు ఒక్క పుష్ప సినిమాతో వచ్చేసింది.

అందుకే తెలుగు వద్దు ఇక హిందీ ముద్దు అనుకుంది ఈ అమ్మడు.

కానీ టైం అందరికి ఒక్కలా ఉండదు.హిందీ( Hindi )లో సినిమాలు తీయాలని కోరిక ఉంటె సరిపోదు అక్కడ సక్సెస్ కూడా ఉండాలి.అందుకే రష్మిక తెలుగు లో సినిమాలు వదిలేసి బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని ఎన్నో కలలు కన్నా కూడా అవి నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు.

Advertisement

ఎందుకంటే ఆమె హిందీ లో ఇప్పటి వరకు నటించిన రెండు సినిమాలు కూడా అట్టర్ ప్లాప్ అవ్వడం తో రష్మిక కు ఏం చేయాలో అర్ధం కాకా మళ్లి తెలుగు సినిమాల్లో బిజీ అవుతుంది.మరో వైపు ఇప్పటికే కమిట్ అయినా హిందీ సినిమాల్లో కూడా నటిస్తుంది అలాగే కొత్తగా తెలుగు సినిమాలకు కమిట్ అవుతుంది.

మొట్టమొదట గా హిందీ లో గుడ్ బాయ్ అనే చిత్రం లో నటించిన రష్మిక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడం తో ఫుల్ డిప్రెస్ అయిపొయింది.ఆ తర్వాత ఏడాదికి మిషన్ మంజు అనే మరో సినిమాలో కూడా నటించింది.ఇది కూడా దారుణ పరాజయం పాలవ్వడం తో అయోమయంలో కూడా పడిపోయింది రష్మిక.

ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) సినిమా అనిమల్( Animal ) లో పెళ్లయిన అమ్మాయి పాత్రలో రణవీర్ పక్కన హీరోయిన్ గా నటిస్తుంది.ఇది తప్ప ఆమెకు మరొక హిందీ సినిమా లేదు.

కానీ ఎందుకు అయినా మంచిదని రెయిన్బో, పుష్ప సీక్వెల్, విజయ్ దేవరకొండ 12 తో పాటు మరొక తెలుగు సినిమా అలాగే ధనుష్ 51 వ సినిమాలో కూడా నటిస్తూ సౌత్ ఇండియా లో ఇంకా బిజీ గానే ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021
Advertisement

తాజా వార్తలు