విజయ్ కి ఝలక్ ఇచ్చిన రష్మిక.. అతని సినిమా నుంచి?

తమిళ సినీ నటుడు విజయ్ గురించి, ఆయన నటన గురించి అందరికీ తెలిసిందే.ఆయనకు తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

ఇక ఈయన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందిస్తాయి.ఈయన సరసన నటించడానికి ఎంతో మంది హీరోయిన్ లు ఎదురు చూస్తుంటారు.

ఈయన సినిమాల గురించి అభిమానులు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు.ఇదిలా ఉంటే రష్మిక మందన ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.

అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్న రష్మిక స్టార్ హీరోల సరసన నటించే అవకాశం సొంతం చేసుకుంది.ఇక రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన నటిస్తుంది.

Advertisement
Rashmika Aparted From Vijay Upcoming Project Rashmika Mandana, Vijay, Delip, Tol

అంతేకాకుండా విజయ్ దేవరకొండ తో సుకుమార్ ఓ సినిమాను చేయనుండగా అందులో రష్మిక ను హీరోయిన్ గా ఎంపిక చేశారట.ఇదే కాకుండా తమిళ స్టార్ హీరో విజయ్ సరసన నటించేందుకు రష్మిక కు అవకాశం రాగా వదులుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Rashmika Aparted From Vijay Upcoming Project Rashmika Mandana, Vijay, Delip, Tol

ప్రస్తుతం నెల్సన్ దిలిప్ దర్శకత్వంలో తెరకెక్కనున్న విజయ్ 65 వ సినిమా లో హీరోయిన్ కన్నడ బ్యూటీ రష్మిక ను ఎన్నుకున్నారట.కానీ తనకు డేట్స్ కుదరకపోవడంతో నో చెప్పిందట.ఇక మరో హీరోయిన్ పూజా హెగ్డే ను సంప్రదించారట.

దీంతో పూజా హెగ్డే కు ఇదివరకే విజయ్ తో నటించాలనే ఆసక్తి ఉండగా ఇక ఈ అవకాశం రాగానే వెంటనే ఓకే చెప్పిందట.ఇదిలా ఉంటే పూజా హెగ్డే 2012లో తమిళంలో మూగ మూడు అనే సినిమాతో తొలిసారిగా తన నటనకు ఎంట్రీ ఇవ్వగా ఈ సినిమా అనుకున్నంత గుర్తింపు తేలేకపోయేసరికి తెలుగు సినిమాలో అడుగు పెట్టింది.

మొత్తానికి తాను కోరుకున్న హీరో సినిమాలో నటించనుంది.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు