మరోసారి బుక్ అయిన రష్మిక విజయ్ దేవరకొండ... ఇప్పటికైనా ఒప్పుకుంటారా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన రష్మిక( Rashmika ) విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ఇద్దరు ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

వీరిద్దరూ కలిసి గీతగోవిందం డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో నటించారు.

ఈ సినిమాల సమయంలోనే ప్రేమలో పడిన వీరిద్దరూ అప్పటినుంచి తరచూ కలిసి వెళ్లడం రెస్టారెంట్లకు( Restaurant ) వెళ్లడం వంటివి చేస్తున్నారు.విడివిడిగా సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు ద్వారా అడ్డంగా దొరికిపోతున్న సంగతి తెలిసిందే.

Rashmika And Vijay Devarakonda Spotted At Restaurant Details, Vijay Devarakonda,

వీరిద్దరు విడివిడిగా ఫోటోలు షేర్ చేసిన వీరు బ్యాక్గ్రౌండ్ ఒకటే ఉండటంతో ఎక్కడికి వెళ్లినా వీరిద్దరూ కలిసే వెళ్తున్నారని తెలుస్తుంది.ఇక వీరి ప్రేమ గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చిన వీరు మాత్రం ఆ ప్రేమ వార్తలను ఖండిస్తూనే వచ్చారు.ఇటీవల విజయ్ దేవరకొండ సాహిబా అనే మ్యూజిక్‌ ఆల్బమ్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రేమ గురించి మాట్లాడుతూ తాను సింగిల్ కాదని రిలేషన్ లో ఉన్నానని చెప్పకనే చెప్పేశారు.

అయితే అందరూ కూడా రష్మికతోనే ఈయన రిలేషన్లో ఉన్నారని భావించారు.

Rashmika And Vijay Devarakonda Spotted At Restaurant Details, Vijay Devarakonda,
Advertisement
Rashmika And Vijay Devarakonda Spotted At Restaurant Details, Vijay Devarakonda,

ఇదిలా ఉండగా తాజాగా మరోసారి వీరిద్దరూ జంటగా కనిపించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని స్పష్టంగా తెలుస్తుంది.కానీ వీరిద్దరూ మాత్రం వారి ప్రేమ విషయాన్ని ఒప్పుకోవడం లేదని అభిమానులు భావిస్తున్నారు.తాజాగా విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న కలిసి ఒక రెస్టారెంట్‌లో బ్రేక్ ఫాస్ట్ చేస్తూ కనిపించారు.

అయితే రష్మిక తన ఫొటోను మాత్రమే సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు కానీ వీరిద్దరూ కలిసి తింటున్నటువంటి ఫోటోలు ప్రస్తుతం బయటకు రావడంతో మరోసారి వీరి డేటింగ్( Dating ) రూమర్స్ తెరపైకి వచ్చాయి.ఇక రష్మిక ప్రస్తుతం పుష్ప 2( Pushpa 2 )సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు