మానవత్వం చచ్చిపోయిందంటున్న రష్మీ.. ఓడిపోయామంటూ?

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలు అనే విషయం మనందరికీ తెలిసిందే.

గతంలో అనేక సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా రష్మీ జంతువులపై తనకు ఉన్న ప్రేమను వ్యక్తపరిచింది.

సోషల్ మీడియాలో రష్మీ జంతువులను హింసించినా, జంతువులతో క్రూరంగా ప్రవర్తించినా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు.గతంలో గుజరాత్ లో ఒక చిరుతపులి పిల్లను కొందరు యువకులు బంధించి హింసించిన వీడియో వైరల్ అయింది.

దీంతో ఆ వీడియోను ప్రధాని నరేంద్ర మోదీకే రష్మీ గౌతమ్ ట్యాగ్ చేసి భారత్ కు డిజిటల్ ఇండియాతో పాటు సెన్సిబుల్ ఇండియా కూడా కావాలని పేర్కొంది.మరో వ్యక్తి లేగదూడతో వికృత చేష్టలకు పాల్పడగా ఎటు వెళుతున్నాం మనం అని ప్రశ్నించింది.

లేగదూడకు మాటలు రావు కాబట్టి అతనికి కొంచెం కూడా భయం లేకుండా వికృత ఛేష్టలకు పాల్పడ్డాడని పేర్కొంది.ఆ సమయంలో రష్మీ కొందరు బాలీవుడ్ నటులను ట్యాగ్ చేసింది.

Rashmi Shocking Comments About People In Society, Rashmi Anilmal Love, Sensibul
Advertisement
Rashmi Shocking Comments About People In Society, Rashmi Anilmal Love, Sensibul

తాజాగా మరోసారి రష్మీ గౌతమ్ మానవత్వం చచ్చిపోయిందంటూ ట్వీట్ చేసింది.ప్రజలకు జంతువుల విషయంలో ఎంత ప్రేమగా వ్యవహరించాలో ఎన్నిసార్లు చెప్పినా వాళ్లలో ఏ మాత్రం మార్పు రావడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.ఒక నెటిజన్ ఒక పిల్లవాడు కుక్కపిల్లను వాటర్ ట్యాంకర్ లో పడేసి ఆ కుక్క పిల్ల చావుకు కారణమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా రష్మీ ఆ వీడియోను పోస్ట్ చేసి ఘాటుగా విమర్శించింది.

డిగ్రీలను సాధించాలనే రేసులో పడి ప్రాథమిక జీవిత పాఠాలను నేర్పించడంలో మనం విఫలమవుతున్నామని పేర్కొంది.మన భవిష్యత్తు కూడా ఇదే విధంగా ఉంటుందని మానవత్వం చచ్చిపోయిందంటూ పోస్ట్ చేశారు.

మరోవైపు రష్మీ గౌతమ్ కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్న రష్మీ కోలుకుంటున్నారని తెలుస్తోంది.

టికెట్స్ వివాదం : సీనియర్ ఎన్టీఆర్ సమయంలోను ఇదే గొడవ.. దాసరికి ఏం జరిగిందో తెలుసా ?
Advertisement

తాజా వార్తలు