వెబ్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాశీఖన్నా

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ రాశీఖన్నా.

ఈ అమ్మడు ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

నెంబర్ వన్ హీరోయిన్ కాకపోయిన స్టార్ హీరోయిన్ పొజిషన్ లోకి వచ్చింది.తెలుగు, తమిళ బాషలలో గత మూడేళ్ళ నుంచి గ్యాప్ లేకుండా ఏడాదికి కనీసం నాలుగు సినిమాలకి తక్కువ కాకుండా చేస్తుంది.

Rashi Khanna Likely To Work In Web Series, Ott Platform, Digital Entertainment,

వాటిలో సూపర్ హిట్ అయిన సినిమాలే ఎక్కువ.అయితే ఈ ఏడాది ఆమె పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

తెలుగులో అల్లు అర్జున్ కి జోడీగా ఐకాన్ సినిమా స్టార్ట్ అవుతుందని అనుకున్న అది వెనక్కి వెళ్ళిపోయింది.దీంతో తెలుగులో చేయడానికి సినిమాలు లేవు.

Advertisement

ఇక తమిళంలో సూర్యకి జోడీగా ఒక సినిమాలో నటించడానికి ఒకే చెప్పింది.అలాగే రెండు సినిమాలు కమిట్ అయ్యింది.

అయితే మార్చి నుంచి కరోనా పరిస్థితుల కారణంగా ఆ సినిమాలు వాయిదా పడిపోయాయి.అవి ఇప్పుడు స్టార్ట్ అవుతాయో కూడా తెలియని పరిస్థితి.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ కాంపిటేషన్ చూస్తే ఇక రాశీ ఖన్నాకి అనుకున్న స్థాయిలో అవకాశాలు దొరకడం కష్టమనే మాట వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో ఈ అమ్మడు కూడా ఓ వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

తెలుగు, తమిళ, హిందీ బాషలలో తెరకెక్కే ఆ వెబ్ సిరీస్ కోసం రాశీ ఆసక్తిగా ఎదురుచూస్తుంది.అందులో ఇప్పటి వరకు చేయనటువంటి డిఫరెంట్ రోల్ లో అమ్మడు కనిపించబోతున్నట్లు టాక్.

ఇంట్లో చీమ‌లు ఇరిటేట్ చేస్తున్నాయా..?అయితే ఈ టిప్స్ మీకే!

మొత్తానికి సినిమా కెరియర్ సందిగ్ధంలో పడిన అందాల భామలు అందరూ వెబ్ సిరీస్ ల బాట పట్టినట్లు ఇప్పుడు రాశీ కూడా అదే రూట్ లో తన కెరియర్ ని బిల్డ్ చేసుకునే పనిలో పడింది అనే మాట వినిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు