గుంటూరు లో కలకలం రేపిన అత్యాచార ఘటన..

గుంటూరు జిల్లాలో కొన్ని రోజుల క్రితం జరిగిన దాచేపల్లి ఘటన మరువక ముందే.

వెంటవెంటనే మరో ఘటన జరిగింది అయితే ఈ సంఘటన కూడా మరువక ముందే మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

మైనర్ బాలిక పై ఒక యువకుడు అత్యచారానికి పాల్పడ్డాడు.ఈ ఘటనతో గుంటూరు జిల్లా అట్టుడికి పోయింది.

ఈ ఘటన పాత గుంటూరులోని బాలాజీ నగర్ లో జరిగింది.వివరాలలోకి వెళ్తే.

రెండో తరగతి చదువుతోంది మైనర్ బాలికపై బాలాజీ నగర్ ప్రాంతానికి చెందిన రఘు (20) కన్నేశాడు మంగళవారం ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన అతడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.ఈ ఘటన జరుగుతున్న సమయంలోనే బాలిక కేకలు వేస్తూ ఇంట్లో నుంచి బయటకు వచ్చి చుట్టు పక్కలవారికి చెప్పడంతో స్థానికులు ఎంతో కోపానికి లోనయ్యారు.ఆ యువకుడిని పట్టుకుని కొట్టడానికి సిద్దం అయ్యారు దాంతో ఆ యువకుడు అక్కడి నుంచీ పారిపోయి పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

Advertisement

ఆ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు పెద్దసంఖ్యలో వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు.అత్యాచారయత్నానికి పాల్పడ్డ యువకుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు అక్కడితో ఆగకుండా పోలిస్ స్టేషన్ ని ముట్టడి చేసి రాళ్ళు రువ్వారు.

దాంతో స్టేషన్ అద్దాలు ధ్వంసం కాగా రాళ్లు తగిలి పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.అలాగే స్టేషన్‌లో ఉన్న పోలీస్ జీప్, ఇతర వాహనాలకు ఆందోళనాకారులు నిప్పుపెట్టారు.

పరిస్థితి చేయి దాటటంతో పోలీసులు లబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు.లాటీ చార్జ్ కూడా చేశారు.

అయితే పరిస్థితిని అదుపు చేయడానికి ఎస్పీ కలిపించుకుని భాదితుల నుంచీ ఫిర్యాదు స్వీకరించారు.విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 1, శనివారం 2023
Advertisement

తాజా వార్తలు