మారుతీ నగర్ సుబ్రమణ్యం రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం.

( Maruthi Nagar Subramanyam ) ఈ సినిమాలో రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు.

పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ బ్యానర్స్ పై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య ఈ సినిమాను నిర్మించారు.అయితే ఈ సినిమా స్టార్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

తాజాగా అనగా నేడు ఆగస్టు 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది కథ ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే.

Rao Ramesh Indraja Maruthi Nagar Subramanyam Movie Review And Rating Details, Ma

కథ.

సుబ్రహ్మణ్యం(రావు రమేష్)( Rao Ramesh ) చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా వచ్చిన ప్రతి జాబ్ అప్లై చేస్తూ ఉంటాడు.కానీ అతనికి ఏ జాబు రాదు.

Advertisement
Rao Ramesh Indraja Maruthi Nagar Subramanyam Movie Review And Rating Details, Ma

ఇంతలోపే పెళ్లి అయ్యి అతని భార్య కళారాణి (ఇంద్రజ)కు( Indraja ) గవర్నమెంట్ జాబ్ వస్తుంది.సుబ్రహ్మణ్యం కు ఒక జాబ్ వచ్చినా అది కోర్టులో కేసు పడటంతో అపాయింట్మెంట్ రాదు.

తన డబ్బుల తోనే సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటాడు.పెళ్లయి 25 ఏళ్ళు అయినా సుబ్రహ్మణ్యం ఇంకా ఏదో జరుగుద్ది, గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనుకోని భార్య సంపాదన మీద బతికేస్తూ, భార్యకి భయపడుతూ ఉంటాడు.

ఇక సుబ్రహ్మణ్యం కొడుకు అర్జున్(అంకిత్)( Ankith ) తను అల్లు అరవింద్ కొడుకని, అల్లు అర్జున్ తమ్ముడు అని కలలు కంటూ ఉంటాడు.తొలిచూపులోనే కాంచన(రమ్య)తో( Ramya ) ప్రేమలో పడతాడు.

ఒకరోజు అనుకోకుండా సుబ్రహ్మణ్యం అకౌంట్ లో 10 లక్షలు పడతాయి.దీంతో అవి ఎక్కడ్నుంచి వచ్చాయో తెలీక జుట్టు పీక్కుంటారు తండ్రి కొడుకులు.

నాకు అవార్డు రాకుండా రాజకీయం చేశారు.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

ఈ క్రమంలో అవసరాలతో ఆ డబ్బులు ఖర్చు పెట్టేస్తారు తండ్రి కొడుకులు. అసలు ఆ 10 లక్షలు ఎవరు వేశారు? సుబ్రహ్మణ్యంకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందా?లేదా? అర్జున్ ప్రేమ సక్సెస్ అయ్యిందా లేదా ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Advertisement

విశ్లేషణ.

ఇటీవల కాలంలో విడుదలైన కొన్ని చిన్న చిన్న సినిమాలు ఫుల్ లెన్త్ రోల్ లో విడుదల అయ్యి ప్రేక్షకులను బాగానే నవ్విస్తున్నాయి.ఇటు నవ్విస్తూనే అటు ప్రేక్షకులను ఎమోషన్ తో మెప్పిస్తున్నాయి.

అలా తాజాగా విడుదలైన ఈ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా మొత్తం అంతా కూడా ఫుల్ గా నవ్వించేశారు.సినిమాలోని అంశాలను కూడా చాలా బాగా తెరకెక్కించారు.

సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులని నవ్వించడమే పనిగా పెట్టుకున్నారు.అయితే ఫుల్ గా కామెడీగా సాగిపోతున్న సినిమాలో మధ్య మధ్యలో ఎమోషన్ ట్రాక్ పెట్టడంతో ఆ సీన్స్ అక్కడ సెట్ అవ్వలేదు అనిపిస్తుంది.

క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు.

నటీనటుల పనితీరు.

రావు రమేష్ ఎప్పటిలాగే తన కామెడీతో ప్రేక్షకులను బాగా మెప్పించారు.మధ్య మధ్యలో ఎమోషనల్ సన్నివేశాలలో కూడా బాగా నటించారు.

మొత్తానికి తన నటనతో మెప్పించారనే చెప్పాలి.ఇందులో ఆయన ఇచ్చే చిన్న చిన్న డైలాగ్స్, హావభావాలు కూడా నవ్వు తెప్పిస్తాయి.

కష్టపడే భార్య పాత్రలో ఇంద్రజ మెప్పించింది.అంకిత్ కొయ్య ఇటీవల వరుస సక్సెస్ లు కొడుతూ ఫామ్ లో ఉన్నాడు.

ఈ సినిమాలో రావు రమేష్ పాత్రతో కలిసి ఫుల్ గా నవ్వించడమే కాక హీరోయిన్ పక్కన కూడా మెప్పించాడు.ఇలా సినిమాలో ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించారని చెప్పాలి.

మిగిలిన నటినటులు కూడా బాగానే నటించి మెప్పించారు.

సాంకేతికత.

ఇందులో సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి.పాటలు ఇంకా బాగున్నాయి.

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్నిచోట్ల బాగున్నా మరి కొన్నిచోట్ల పర్వాలేదనిపించింది.అలాగే కామెడీ సన్నివేశాలలో RR బాగా వర్కౌట్ అయింది.

కొత్త కథ, కొత్త కథనంతో దర్శకుడు లక్ష్మణ్ కార్య ఈ సినిమాని పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు.నిర్మాణ పనులు కూడా బాగానే ఉన్నాయి.

సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.

రేటింగ్: 3/5

తాజా వార్తలు