మామ బర్త్ డే సందర్భంగా మూవీ రిలీజ్ చేయనున్న మెగా మేనల్లుడు!

మెగా హీరోల్లో వైష్ణవ్ తేజ్ ఒకరు.ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకుల చేత శబాష్ అనిపించు కున్నాడు.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా ద్వారా వైష్ణవ్ తేజ్ తెలుగు సినిమా తెరకు పరిచయం అయ్యాడు.మొదటి సినిమా తోనే 50 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.

దీంతో మెగా హీరోల లిష్టులో ఈయన క్రేజీ హీరోగా మారిపోయాడు.ఫస్ట్ సినిమా హిట్ తోనే సూపర్ హిట్ అందుకోవడంతో ఈయనకు పెద్ద పెద్ద బ్యానర్ల నుండి వరుస అవకాశాలు వరించాయి.

ఇక ఉప్పెన సినిమా తర్వాత కొండపొలం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.ఈ సినిమాలో కూడా ఈయన అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టు కున్నాడు.

Advertisement

ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా సినిమాలో నటిస్తున్నాడు.గిరీశయ్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన టీజర్ ఆకట్టుకుని ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసాయి.ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి మరొక అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఈ రోజు ప్రకటించారు.సెప్టెంబర్ 2న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.మరి సెప్టెంబర్ 2న ఆయన మామయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు.

ఈ సందర్భంగా ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు మెగా మేనల్లుడు రెడీ అయ్యాడు.ఈ సినిమా పవన్ పుట్టిన రోజు రిలీజ్ కావడంతో మెగా ఫ్యాన్స్ సైతం ఖుషీ వ్యక్తం చేస్తున్నారు.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??

ఆయన పుట్టిన రోజు కి మేనల్లుడు గిఫ్ట్ గా తన సినిమాను రిలీజ్ చేస్తున్నాడు.ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.బివిఎస్ఎన్ నిర్మిస్తున్నారు.

Advertisement

ఈ సినిమాలో రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.

తాజా వార్తలు