మార్గదర్శి కేసులో రామోజీరావుకి ఇబ్బందులు తప్పవా?

కేసు మొదలే దశాబ్దాలు గడుస్తున్నా ఇంతవరకు అంతా రామోజీరావు( Ramoji Rao ) కు అనుకూలంగానే నడుస్తూ వచ్చిన మార్గదర్శి( Margadarsi Chit Fund ) కేసు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది.

జగన్ ప్రభుత్వం ఇంప్లీడ్ పిటిషన్ వేయడంతో ఇప్పుడు విషయం రామోజీ vs ఏపీ ప్రభుత్వం గా మారింది.

చట్టప్రకారం చూసుకుంటే రామోజీ సంస్థలు చేస్తున్నది ఆర్థిక నేరమనే విషయం నిపుణులు చెబుతున్న మాట .చిట్ ఫండ్ సంస్థలు తాము సేకరించిన మొత్తాన్ని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలి అన్న ప్రాథమిక విషయాన్ని ధిక్కరించి లో తమ అధీనంలో ఉన్న ఇతర కంపెనీలకు ఆ డిపాజిట్లు మళ్ళించారు అన్నది మార్గదర్శి మీద ఉన్న ప్రధాన ఆరోపణ.అయితే ఇంతవరకు ప్రభుత్వపరమైన మద్దతుతో ఇబ్బందులు రాకుండా మేనేజ్ చేయగలిగిన మార్గదర్శి యాజమాన్యం ఇప్పుడు స్వయంగా ప్రభుత్వం రంగంలోకి దిగడంతో ఇబ్బందులు తప్పవని కొంతమంది విశ్లేషిస్తున్నారు.

ఇదే విషయంపై మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్( Vundavalli Aruna Kumar ) ఆర్థిక నేరాలు చేసిన ఎంతటి వారైనా శిక్ష తప్పదని, ప్రజల్లో గొప్ప పేరు తెచ్చుకున్న సత్యం రామలింగరాజు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వంటి వారు సైతం ఆర్థిక నేరాలు వల్లే జైలు పాలు అయ్యారని ఆయన వివరించారు.నిబంధనలకు విరుద్ధంగా కొన్ని నియమాలు ఉల్లంఘించడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికే ఆర్.బి.ఐ పెనాల్టీ విధించిందని, రామోజీ అంతకంటే గొప్పవారా? అంటూ ఆయన ప్రశ్నించారు.మార్గదర్శి చేసిన ఆర్థిక అవకతవకలపై ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని అయితే ఇప్పటివరకు ప్రశ్నించే సరైన వ్యవస్థ లేకపోవడం వల్లే ఆయన తప్పించుకోగలిగారని, ఇప్పుడు జగన్ ప్రభుత్వం గట్టిగా నిలబడటం మంచి విషయం అని ఇప్పటికైనా రామోజీ తన ఆర్థిక నేరాలు అంగీకరించాలంటూ ఆయన చెప్పుకొచ్చారు.

ఎవరు కేసు పెట్టలేదు కాబట్టి మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు అన్న విధానం సరైనది కాదని ఎలాంటి వారు తప్పు చేసినా కూడా నిలదీసే వ్యవస్థ మనకు రాజ్యాంగం ఇచ్చిందని దీనికి ఎవరూ కూడా అతీతులు కారని ఆయన వా ఖ్యలు చేశారు తప్పు చేసిన వారిని తమ ఆఫీసుకు పిలిచి విచారణ చేయాల్సిన విచారణ సంస్థలు ఇప్పటికీ కూడా ఆయనను అత్యంత గౌరవిస్తున్నాయని ఆయన ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్యo సరిగా ఉందో లేదు చూసుకుని మాత్రమే విచారణ చేసి వస్తున్నాయని ఈ విషయంలో ఇప్పటికీ రామోజీ వ్యవస్థలను కంట్రోల్ చేయగలుగుతున్నారంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement
ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో మరొకరు లేరా..? ఆయనకి ఎందుకంత క్రేజ్...

తాజా వార్తలు