రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!

విజయవాడ కానూరులో రామోజీరావు సంస్మరణ సభ( Ramojirao Memorial Program ) నిర్వహించటం జరిగింది.

ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు( CM Chandrababu ) సతీ సమేతంగా హాజరయ్యారు.

సీనీ రాజకీయ ప్రముఖులు పాత్రికేయ దిగ్గజం చిత్రపటానికి నివాళులర్పించారు.సీనియర్ నటులు మురళీమోహన్, జయసుధ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది.

రామోజీరావు తన పత్రిక ద్వారా సమాజ హితం కోసం పాటుపడ్డారని పేర్కొన్నారు.జిల్లా ఎడిషన్లు తీసుకొచ్చి ఎక్కడికక్కడ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు.

ప్రతి రంగంలో ప్రవేశించి తనదైన ముద్రను వేయగలిగారని కొనియాడారు.ప్రియా పచ్చళ్లను 150 దేశాలకు ఎగుమతి చేశారని వెల్లడించారు.

Ramoji Rao Should Be Given Bharat Ratna By Cm Chandrababu Key Comments Details,
Advertisement
Ramoji Rao Should Be Given Bharat Ratna By CM Chandrababu Key Comments Details,

రామోజీ ఫిలిం సిటీని( Ramoji Film City ) దేశంలోనే గొప్ప పర్యాటక ప్రదేశంగా అందంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు.కరోనా సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి రామోజీరావు.ఆయన బతికినంత కాలం నీతి, నిజాయితీ అనే విలువలకు కట్టుబడి బతికారు.

ప్రజాస్వామ్యం అపహాస్యమైనప్పుడల్లా నేనున్నానంటూ ముందుకొచ్చి పోరాడారు.ఎన్టీఆర్, రామోజీరావు యుగపురుషులని చంద్రబాబు అభివర్ణించారు.

ఎప్పటినుండో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.రామోజీరావుకు కూడా భారతరత్న( Bharat Ratna ) వచ్చేలా కృషి చేద్దాం.

రాజధానికి అమరావతి అనే పేరు ఆయనే సూచించారు.అందుకే అక్కడ ఆయన పేరిట విజ్ఞాన్ భవన్ నిర్మిస్తాం.

తుమ్మినప్పుడు కళ్లు మూసుకుంటాం ఎందుకు? కళ్లు తెరిచి తుమ్మితే అలా జరుగుతుందా??

ఓ రోడ్డుకు రామోజీ పేరు పెడతాం.విశాఖలో రామోజీరావు పేరిట చిత్రగిరి, ఎన్టీఆర్ ఘాట్ మాదిరిగా మెమోరియల్ నిర్మిస్తామని రామోజీరావు సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు తెలియజేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు