రామోజీరావు వ్యక్తి కాదు.. వ్యవస్థ..: చంద్రబాబు

హైదరాబాద్( Hyderabad ) ఫిల్మ్ సిటీలో రామోజీరావు( Ramoji Rao ) భౌతిక కాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) నివాళులు అర్పించారు.

రామోజీరావు కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన రామోజీరావు మరణం బాధాకరమని తెలిపారు.

రామోజీరావు మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చంద్రబాబు అన్నారు.రామోజీరావు ఒక యుగపురుషుడన్న ఆయన సమాజహితం, తెలుగుజాతి కోసం రామోజీరావు పని చేశారని కొనియాడారు.

సాధారణ కుటుంబంలో జన్మించి అసాధరణ స్థాయికి ఎదిగారన్నారు.రామోజీరావు వ్యక్తి కాదని.వ్యవస్థని తెలిపారు.40 ఏళ్లుగా రామోజీరావుతో కలిసి నడిచానన్నారు.ఎల్లప్పుడూ ప్రజాపక్షంగానే ఉంటానని రామోజీరావు చెప్పారని గుర్తు చేశారు.

రామోజీరావు నిర్మించిన వ్యవస్థలు శాశ్వతమని పేర్కొన్నారు.రామోజీరావు ఇచ్చిన స్ఫూర్తితో ఏపీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

Advertisement
ఒకే సమయంలో ఎక్కువ సినిమాలు.. ప్రభాస్ కు మాత్రమే ఎలా సాధ్యమవుతుంది?

తాజా వార్తలు