షాలినితో పెళ్లి వద్దని అజిత్ కు వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్ ?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలోని క్యూట్ కపుల్స్ లో అజిత్, షాలిని జోడీ ఒకటనే సంగతి తెలిసిందే.ఈ జోడీ పెళ్లి వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి.

అయితే షాలినితో పెళ్లి వద్దని ఒక డైరెక్టర్ అజిత్ కు వార్నింగ్ ఇచ్చారట.వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా రమేష్ ఖన్నా అనే దర్శకుడు షాలినిని పెళ్లి చేసుకోవద్దని అజిత్ కు సూచనలు చేశారని సమాచారం.

షాలిని బాల నటిగా కెరీర్ ను మొదలుపెట్టగా ఆమె నటించిన పలు సినిమాలు సక్సెస్ సాధించాయి.

అమర్కలం సినిమాలో అజిత్ షాలిని తొలిసారి కలిసి నటించగా ఈ జోడీకి మంచి మార్కులు పడ్డాయి.మొదట తాను చదువుకుంటానని ఈ సినిమాలో నటించడం ఇష్టం లేదని షాలిని చెప్పగా చివరకు ఈ సినిమాకు సంబంధించి హీరో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.అజిత్ ఎంతో కష్టపడి షాలినికి నచ్చజెప్పగా చివరకు అజిత్ పై ఉన్న అభిమానం వల్ల ఆమె ఈ సినిమాలో నటించడానికి అంగీకారం తెలిపింది.

Advertisement

అమర్కలం మూవీ షూట్ సమయంలో అజిత్ చేతికి గాయం కాగా అజిత్ ఆరోగ్యం గురించి తరచూ తెలుసుకుంటూ షాలిని అజిత్ కు దగ్గర కావడం జరిగింది.ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడటం పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడం జరిగింది.

ప్రస్తుతం ఈ జంటకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.అయితే అజిత్ పెళ్లికి ముందు రమేష్ ఖన్నా అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారని షాలినిని పెళ్లి చేసుకోవద్దని అజిత్ కు సూచించడం జరిగింది.

ఆ షాలినిని అస్సలు పట్టించుకోవద్దని అజిత్ కు రమేష్ కన్నా సూచించడం జరిగింది.అయితే అప్పటికే అజిత్ షాలిని ప్రేమలో ఉండగా 2000 సంవత్సరంలో వివాహం జరిగింది.వీళ్లిద్దరి పెళ్లికి రమేష్ ఖన్నా కూడా హాజరయ్యారు.

పెళ్లి తర్వాత షాలిని సినిమాలకు దూరంగా ఉన్నారు.షాలిని సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?
Advertisement

తాజా వార్తలు