మెగా స్టార్‌ మూవీలో చరణ్‌ కూడా... మెగా ఫ్యాన్స్‌ కోరిక తీర్చబోతున్న కొరటాల శివ

మెగాస్టార్‌ రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెం.150’ చిత్రంలో రామ్‌ చరణ్‌ ఒక పాటలో కనిపించిన విషయం తెల్సిందే.

కొద్ది సమయం కనిపిస్తేనే ఫ్యాన్స్‌కు మంచి కిక్‌ ఎక్కింది.

అదే ఒక పాత్రలో చరణ్‌ కనిపిస్తే, చిరంజీవి మూవీ స్థాయి అమాంతం పెరగడం ఖాయం అని, అందుకే చరణ్‌ను తన సినిమాలో చూపించేందుకు దర్శకుడు కొరటాల శివ ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం చిరంజీవి తన 151వ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తి కావస్తుంది.త్వరలోనే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.

మరో వైపు చిరు 152వ మూవీకి కొరటాల స్క్రిప్ట్‌ సిద్దం చేశాడు.త్వరలోనే చిత్రీకరణ కూడా ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

కొరటాల దర్శకత్వంలో చిరంజీవి డబుల్‌ రోల్‌లో కనిపించనున్నాడు.దాంతో పాటు చరణ్‌ కూడా కీలకమైన గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్నాడు.దాంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి.2020వ సంవత్సరం ఆరంభంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

మనిషి చివరి క్షణాలలో.. ఈ వస్తువులు దగ్గర్లో ఉంటే స్వర్గం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు