అరుదైన ఘనత సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. ఏమిటంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్లుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ సినిమాలు సక్సెస్ అవుతున్నా ఇండస్ట్రీ హిట్ అనిపించుకునే స్థాయిలో కలెక్షన్లను మాత్రం సాధించలేదు.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ఖాతాలో కలెక్షన్లపరంగా కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్, చరణ్ లకు దర్శకధీరుడు రాజమౌళి కెరీర్ బెస్ట్ హిట్ తో పాటు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును తెస్తారని ఇరుహీరోల ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీలో కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా భీమ్ టీజర్ గతేడాది అక్టోబర్ 22న విడుదలైంది.ఇప్పటికే ఈ టీజర్ కొన్ని రికార్డులను సొంతం చేసుకోగా తాజాగా ఈ టీజర్ మరో రికార్డును సొంతం చేసుకోవడం గమనార్హం.

భీమ్ టీజర్ తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో విడుదల కాగా అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ల వ్యూస్ ను సాధించడం గమనార్హం.సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లైన యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లలో మొత్తం వ్యూస్ 100 మిలియన్ మార్క్ ను అందుకోవడంతో ట్విట్టర్ లో #100MViewsForBheemIntro అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

Advertisement

విడుదలకు ముందే ఎన్టీఆర్ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుండటం గమనార్హం.

ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన దసరా పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.థియేట్రికల్ హక్కులతో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా నటించాల్సి ఉంది.

ఎన్టీఆర్, ఒలీవియా మధ్య సీన్లను రాజమౌళి ఇప్పటికే తెరకెక్కించారని సమాచారం.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?
Advertisement

తాజా వార్తలు