Rama Rajamouli :రమా రాజమౌళి ఓపెన్ ఛాలెంజ్… మాలాగా చేసే దమ్ముందా..?

నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది.మంచి చెడు అనేవి కూడా అందరికి సరిసమానంగా వర్తిస్తాయి.

వీలైనంత వరకు నెగటివిటి కి దూరంగా ఉంటూ తమ జీవితాలను సాఫీగా గడిపించుకోవడమే జీవితం.అందుకు ఉదాహరణ రమా రాజమౌళి కుటుంబం.

చాల ఏళ్లుగా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సినిమాలు తీస్తూ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో గొప్ప స్థాయికి చేరిన కుటుంబం వీరిది.అయితే ఒక సినిమా రాజమౌళి( Rajamouli ) ఒప్పుకున్నాడు అంటే ఆ సినిమాకు సంబంధించి అన్ని పనులు కూడా అయన కుటుంబం లోని వారే చూసుకుంటారు.

ఏవో ఒకటి లేదా రెండు పనులు తప్ప దాదాపు అన్ని బాధ్యతలు ఎవరో ఒకరు భుజాలపై మోస్తూ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారు.

Advertisement

డైరెక్షన్ రాజమౌళి, లైన్ ప్రొడ్యూసర్ గా అయన కొడుకు కార్తికేయ, కాస్ట్యూమ్ డిజైనర్ గా అయన భార్య రమా, ఇక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రాజమౌళి వదిన వల్లి, సంగీతం అతడి అన్న కీరవాణి, అలాగే పాటలు అయితే కీరవాణి కొడుకు భైరవ, కార్తికేయ( Karthikeya ) భార్య చేస్తూ ఉంటారు.అయితే ఇన్ని పనులు కుటుంబమే చేయడం వల్ల వారిది ఒక ఫ్యామిలీ ప్యాకేజి అంటూ కొంత మంది ట్రోల్ చేస్తూ ఉంటారు.అయితే సినిమా అన్నాక ఎవరైనా పాజిటివ్ గా మాట్లాడవచ్చు లేదా నెగటివ్ గా మాట్లాడవచ్చు.

అందుకే ముందే చెప్పుకున్నట్టు నరం లేని నాలుక ఏదైనా మాట్లాడిస్తుంది.కానీ వీటన్నిటి పైన కొన్నాళ్ల క్రితం రాజమౌళి భార్య రమా( Rama Rajamouli ) ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.

మేము చేస్తున్న పని మా పిల్లలు కూడా చేస్తారు.మా రక్తంలోనే కష్టపడే నేచర్ వుంది.

మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ కావడంతో డబ్బులు వెనక్కు ఇచ్చేసిన హరీష్ శంకర్.. ఎన్ని రూ.కోట్లంటే?
వైరల్ వీడియో : విజయవాడలో బాహుబలి సీన్ రిపీట్..

మా ఫ్యామిలీ ఏదైనా తప్పు చేసి సినిమాను తప్పుగా చూపిస్తే లేదా ప్లాప్ చేస్తే మేము తప్పు చేస్తున్నట్టు కానీ మేము చేస్తున్న పని అందరికి నచ్చుతున్నప్పుడు వాదించే పని ఏముంది.పోనీ మాలాగా ఎవరైనా చేయగలిగే వాళ్ళు ఉంటే చెప్పండి.

Advertisement

మేము ఒక సినిమా ఒప్పుకున్నాం అంటే దాదాపు రోజులో 18 గంటలు అదే పని చేస్తాం, చేసి విజయం కూడా సాధిస్తాం.మాకు మల్లె చేసే వారు ఉంటే మమ్మల్ని నిందించండి కానీ అలాంటి వారు ఎక్కడ ఉండరు అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు రమా.

తాజా వార్తలు